నాగ చైతన్య ని పెళ్లి చేసుకోకముందు సమంత ఎంత ఆనందంగా, ఎంత ఆహ్లాదంగా ఉంది.. చైతు ని పెళ్లాడిన తర్వాత అంతకన్నా సంతోషంగానే ఉంది. అలాగే కెరీర్ లోనూ సమంత సూపర్ ఫాస్ట్ గా దూసుకుపోయింది. ఇక నాగ చైతన్య తో డివోర్స్ అయ్యాక సమంత చాలా బాధపడింది. అలాగే నెటిజెన్స్ నుండి సమంత తీవ్ర ఇబ్బందులు పడింది.. మొహం లో నవ్వు మాయమైంది, నడకలో హుషారు ఉన్నా.. ఎక్కడో ఏదో కొట్టింది. ఇక డివోర్స్ తర్వాత తీర్థ యాత్రలు, ఫ్రెండ్స్ తో వెకేషన్స్ ని పూర్తి చేసుకుని మునుపుటి సమంత లా మారిపోయినట్లే కనిపిస్తుంది.
నిన్నగాక మొన్న మెగా ఫ్యామిలీ దివాళి పార్టీలో సందడి చేసిన సమంత.. తాజాగా సమంత తన ఫ్రెండ్ మంజుల బర్త్ డే వేడుకల్లో పాల్గొంది. ఆ పార్టీలో సమంత అలా ఇలా లేదు. ఇదే పార్టీలో సామ్ ఫ్రెండ్ నందిని రెడ్డి అలాగే హీరోయిన్ మాళవిక కూడా ఉంది. ఇక గతంలోలా పార్టీలు, ఫంక్షన్స్ అంటూ సమంత హడావిడి మొదలైనట్లే. ఇక సమంత గ్లామర్ డ్రెస్ లో గా హల్చల్ చెయ్యడం చూస్తే సమంత ఎప్పటిలాగే నార్మల్ లైఫ్ లోకి వచ్చేసింది అనిపిస్తుంది. క్లివేజ్ షో తో సమంత గ్లామర్ గా అందంగా.. నార్మల్ లుక్స్ లోకి వచ్చేసింది.. డాక్టర్ మంజుల బర్త్ డే వేడుకల్లో అదరగొట్టిన సమంత తెలుగు, తమిళ్ లాంగ్వేజెస్ లో రెండు సినిమాలు చేయబోతుంది. దసరా స్పెషల్ గా ఆ రెండు మూవీస్ ని మేకర్స్ ప్రకటించారు.