అప్పుడు నోయెల్.. ఇప్పడు జెస్సి

బిగ్ బాస్ సీజన్ 4 లో అభిజిత్ బిగ్ బాస్ విన్నర్ గా బయటకు రాగా.. అఖిల్ రన్నరప్ గా నిలిచాడు. అరియనా, హారిక, సోహెల్ లు టాప్ 5 వరకు వెళ్లారు. ఇక ఏ సీజన్ లో అయినా.. కంటెస్టెంట్స్ ని మధ్యలో పంపరు. ఎలిమినేట్ అయితే తప్ప. ఇక కంటెస్టెంట్స్ అనారోగ్యం పాలయితే.. వెంటనే వాళ్ళకి బిగ్ బాస్ హౌస్ లోనే డాక్టర్స్ చూసి ట్రీట్మెంట్ ఇస్తుంటారు. అయితే గత సీజన్ లో నోయెల్ అనారోగ్య కారణాలతో అనుకోకుండా హౌస్ బయటికి వచ్చేసాడు. ఇక ఈ సీజన్ లో షణ్ముఖ్, సిరి ల ఫ్రెండ్ గా ప్రొజెక్ట్ అయిన జెస్సి.. సడన్ గా బయటికి వచ్చేసాడని అంటున్నారు. కారణం జెస్సి అనారోగ్యకారణాలతో బాధపడుతున్నాడు.
మొదట్లో నాలుగు వారాల వరకు బాగానే ఉన్న జెస్సి నరాల వీక్ నెస్, అంటే వట్టిగో సమస్యతో బాధపడుతున్నాడు. సడన్ గా ఆరోగ్యం పాడవడం, వామిటింగ్స్ అవడం వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. మధ్య మధ్యలో డాక్టర్స్ వచ్చి చెక్ చేస్తున్నారు. టాస్క్ లో పార్టిసిపేట్ చెయ్యొద్దు.. రెస్ట్ తీసుకోమని చెప్పాడు బిగ్ బాస్. అయితే ఆరోగ్యం బాగున్నప్పుడు టాస్క్ లో మంచిగానే పెరఫార్మెన్సు చేస్తూ.. ఫిజికల్ గాను బాగానే మెప్పించాడు. కానీ గత రెండు వారాలుగా జెస్సి ఆరోగ్యం అస్సలు సహకరించడం లేదు.. అందుకే బిగ్ బాస్ జెస్సిని నోయెల్ లా బయటికి పంపేశారని.. అతనికి డాక్టర్స్ ట్రీట్మెంట్ అవసరం అని అందుకే.. ఇలా అంటున్నారు. గత సీజన్ లో నోయెల్, ఈ సీజన్ లో జెస్సి బయటికి వెళ్లిపోయారు అని అంటున్నారు.
After Vishwa Elimination, Jessie Out From Bigg Boss Show
Bigg Boss 5: Jessie Walks Out Of The Show







































