ప్రస్తుతం టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ హడావిడి మాములుగా లేదు. లైగర్ షూటింగ్ లో బిజీగా ఉండాల్సిన విజయ్ దేవరకొండ తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమా కోసం తెగ కష్టపడుతున్నాడు. ఆనంద్ దేవరకొండ హీరోగా విజయ్ దేవరకొండ నిర్మించిన పుష్పక విమానం రేపు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కార్తికేయ రాజా విక్రమార్క తో పోటీ పడుతున్న పుష్పక విమానం సినిమాని విజయ్ దేవరకొండ తెగ మోస్తున్నాడు. అసలు హీరో గా నటించిన సినిమాకైనా విజయ్ ఇంత ప్రమోషన్ చేస్తాడో.. లేదో.. తెలియదు కానీ.. తన బ్యానర్ లో రాబోతున్న పుష్పక విమానం సినిమాని మాత్రం శక్తికి మించి ప్రమోట్ చేస్తున్నాడు.
తమ్ముడు ఆనంద్ దేవరకొండ తో స్పెషల్ ఇంటర్వూస్, అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హల్చల్, ఇంకా తన ఫ్యామిలీ విషయాలతో సినిమాపై అంచనాలు పెంచుతున్నాడు రౌడీ హీరో.. మరి తన ఓన్ సినిమా కాబట్టి ఇంతిలా ప్రమోట్ చేసి.. హీరోగా వేరే నిర్మాణంలో చేసే సినిమాలను లైట్ తీసుకోకూడదు కదా.. అంటున్నారు నెటిజెన్స్. విజయ్ దేవరకొండ పుష్పక విమానం సినిమాని తన సొంత థియేటర్ AVD సినిమాస్ లో స్పెషల్ ప్రీమియర్స్ కూడా వెయ్యబోతున్నాడు. విజయ్ దేవరకొండ పుష్పక విమానం సినిమాని ఇంతిలా ప్రమోట్ చేస్తున్నాడు.. మరి దాని రిజల్ట్ ఎలా ఉంటుందో అనేది మరో నాలుగు రోజుల్లో తేలిపోతుంది.