జబర్దస్త్ లో హైపర్ ఆది స్కిట్స్ అంటే కామెడీ ప్రియులకి మహా ఇష్టం.. మెగా హీరోలని, ఇంకా చాలామందిని ఇమిటేట్ చేస్తూ హైపర్ ఆది వేసే పంచ్ లకు జెడ్జెస్ మాత్రమే కాదు.. ప్రేక్షకులు పడి పడి నవ్వుతారు. జబర్దస్త్ చరిత్రలోనే ఎక్కువగా స్కిట్స్ కొట్టి నెంబర్ వన్ లో ఉన్న హైపర్ ఆది కి కాంట్రవర్సీలు కొత్త కాదు.. తన స్కిట్ లో చేసే పరదేశి, దొరబాబు ల విషయంలో హైపర్ ఆదిని చాలామంది తిట్టారు. అలాగే లాయర్లు ని కించరిచారని ఒకసారి, మొన్నీమధ్యన శ్రీదేవి డ్రామా కంపెనీ లో తెలంగాణ ఫోక్ సాంగ్ విషయంలో హైపర్ ఆది క్షమాపణలు కూడా చెప్పాడు. తాజాగా హైపర్ ఆది తాను చేసిన ఓ స్కిట్ వలన అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది.
దీపావళి సందర్భంగా హైపర్ ఆది ఈటీవీలో ప్రసారం అయిన స్పెషల్ ప్రోగ్రాంలో ఓ హీరో ని కించపరించే విధంగా సెటైర్స్ వేసాడని.. సినీ పరిశ్రమలో ఒక ప్రముఖ కుటుంబానికి చెందిన ఆ హీరోపై ఆది వేసిన పంచులకు గానూ ఆ హీరోగారి అభిమానులు హైపర్ ఆది ఎక్కడ దొరికితే అక్కడ కుమ్మేసాల ఉండడంతో.. హైపర్ ఆది గత మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్నాడని, తాను వెళ్లాల్సిన షూటింగ్ లకి కూడా వెళ్లకుండా, సొంత కారులోని వెళ్లలేని పరిస్థితుల్లో హైపర్ ఆది ఎవరికీ కనిపించకుండా ఉన్నాడని.. కానీ ఆ హీరో అభిమానులు మాత్రం హైపర్ ఆదిని వదిలే ప్రసక్తి లేదంటున్నారట. మరి ఈ విషయంలో ఆది ఏం చేస్తాడో చూడాలి.