Advertisementt

బిగ్ బాస్ 5: ఏకంగా నలుగురు జైల్లోకి

Mon 08th Nov 2021 07:36 AM
bigg boss 5,bigg boss telugu,shanmukh,manas,kajal,sunny  బిగ్ బాస్ 5: ఏకంగా నలుగురు జైల్లోకి
Bigg boss 5: 4 contestants in jail బిగ్ బాస్ 5: ఏకంగా నలుగురు జైల్లోకి
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5  తొమ్మిదివారాలు పూర్తి చేసుకుని.. పదోవారంలోకి అడుగుపెట్టింది. నాగార్జున శని, ఆదివారాలు ఎపిసోడ్స్ తో ఎలాగో బండి లాగిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 నుండి ఇప్పటివరకు తొమ్మిదిమంది కంటెస్టెంట్స్ బయటికి వెళ్లారు. నిన్న ఆదివారం ఎపిసోడ్ లో విశ్వ బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యి.. స్టేజ్ పై కి వచ్చాడు. హౌస్ మేట్స్ అంతా జాగ్రత్తగా ఉండండి.. బిగ్ బాస్ అవకాశం మళ్లీ మళ్ళీ రాదు అని చెప్పిన విశ్వ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యుండి ఎలిమినేట్ అవడమే అందరికి షాక్ ని కలిగించింది. ఆని మాస్టర్ అయితే బాగా కంటతడి పెట్టారు. ఇక ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ కాస్త కొత్తగానే జరిగింది. అంటే వరెస్ట్ పెరఫార్మెర్ గా ఎవరో ఒకరు జైలు కి వెళ్ళాల్సింది. ఈ వారం ఏకంగా నాలుగు జైలుకి వెళ్లడం హాట్ టాపిక్ అయ్యింది. 

ఆని మాస్టర్ కెప్టెన్ గా ఆ నలుగురిని జైల్లో పెట్టింది. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియకి సమయం ఆసన్నమైంది.. కెప్టెన్ ఆని నలుగురు కంటెస్టెంట్స్ ని ఎంచుకుని జైల్లో పెట్టాల్సి ఉంటుంది. అందులో ఆని తన పాయింట్స్ చెప్పి మరీ వాళ్ళని జైల్లో పెట్టింది. మానస్, సన్నీ, కాజల్, షణ్ముఖ్ లని ఆని మాస్టర్ జైల్లో పెట్టి తాళం వేసింది. టాస్క్ ల్లో వాళ్ళు క్లియర్ గా లేరని చెప్పి వాళ్ళని జైల్లో పెట్టింది. మిగతా ఆరుగురు ఆని తో కలిపి బయట ఉన్నారు. మరి ఈ ఆసక్తికర టాస్క్ ఏమిటో ఈ రోజు రాత్రి ఎపిసోడ్ లో తేలిపోతుంది. 

Bigg boss 5: 4 contestants in jail:

Bigg boss 5: Shanmukh, Manas, Kajal, Sunny in Jail

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ