Advertisementt

మీడియా నుండి మొహం దాచుకున్న షారుఖ్

Sun 07th Nov 2021 08:12 PM
shah rukh khan,aryan khan,media,mumbai airport,umbrella  మీడియా నుండి మొహం దాచుకున్న షారుఖ్
Shah Rukh Khan Hides Under an Umbrella to Avoid media మీడియా నుండి మొహం దాచుకున్న షారుఖ్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఈమధ్యన చాలా బాధపడటమే కాదు.. చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది.. కారణం ఆయన కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ రాక ఇలా చాలా ఇబ్బందులు పడ్డాడు షారుఖ్.. మీడియా కి మొహం దాచుకుంటూనే ఆయన తన కొడుకు ఆర్యన్ ఖాన్ ని కలవడానికి జైలు కి వెళ్లేవారు. అయితే కొడుకు ఆర్యన్ కి బాంబే హై కోర్టులో పోరాడి ఎలాగో బెయిల్ తెచ్చుకుని ఇంటికి తీసుకువచ్చారు. తర్వాత షారుఖ్ ఇంటికే పరిమితమయ్యారు.

అయితే నిన్న అంటే ఆరో తేదీన షారుఖ్ ఓ ప్రైవేటు జెట్ విమానంలో ముంబయి నుంచి ఢిల్లీ వెళ్లి.. మళ్ళీ ఈ రోజు అంటే నవంబర్ 7 న తిరిగి ముంబయి చేరుకుంటున్నారని తెలిసిన మీడియా షారుఖ్ కోసం కాపు కాసింది. షారుఖ్ ని ఫొటోస్ తియ్యడానికి, ఆయన్ని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేయాలని డిసైడ్ అయ్యింది. ఇదంతా గమనించిన షారుఖ్ సెక్యూరిటీ ఎయిర్ పోర్ట్ నుండి షారుఖ్ ని గొడుగు చాటున నించోబెట్టి కారులో ఎక్కించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఆ వ్యక్తి అసలు షారుకేనా.... కాదా ఆరా తియ్యడం అది షారుఖ్ ఖాన్ అని నిర్దారించుకుని మరీ షారుఖ్ వీడియో ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కొడుకు గురించిన ప్రశ్నలు మీడియా ఎక్కడ అడుగుతుందో అని షారుఖ్ మీడియా కి ఇలా ముఖం చాటేసినట్లుగా తెలుస్తుంది. 

Shah Rukh Khan Hides Under an Umbrella to Avoid media:

Was this you Shah Rukh Khan, under the umbrella?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ