ఈ ఏడాది టక్ జగదీశ్ సినిమాలో నాని హీరోయిన్ గా వీఆర్వో గుమ్మడి వరలక్ష్మి గా డీసెంట్ కేరెక్టర్ లో.. సారీస్ తో, సింపుల్ లుక్స్ తో ఎంతో అందంగా కనిపించింది. ఆ సినిమాలో రీతూ వర్మ కేరెక్టర్ ఓ అన్నంతగా లేకపోయినా.. వరలక్ష్మి గా రీతూ వర్మ పెరఫార్మెన్స్ బావుంది. ఇక తాజాగా రీతూ వర్మ వరుడు కావలెను మూవీ తో హిట్ అందుకోవడమే కాదు.. ఆ సినిమాలో భూమి పాత్రలో ఆమె లుక్స్, ఆమె స్టయిల్ కి రీతూ వర్మ పెరఫార్మెన్స్ గురించి అందరూ ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఈగో పర్సన్ గా, ఈగో బాస్ గా, పెళ్లంటేనే ఇష్టం లేని అమ్మాయి.. నాగ శౌర్య తో ప్రేమలో పడడం, రొమాంటిక్ సన్నివేశాలు, ఎమోషనల్ గాను భూమి కేరెక్టర్ లో అదరగొట్టేసింది. సినిమా మెయిన్ హైలెట్స్ లో రీతూ వర్మ నటన ని ప్రత్యేకంగా పొగిడారు. మరి ఈ రెండు సినిమాల తర్వాత రీతూ వర్మ కి స్టార్ హీరోల సినిమాల ఆఫర్స్ వచ్చి పడతాయా..
మొన్న అల్లు అర్జున్ వరుడు కావలెను మూవీ ఈవెంట్ లో రీతూ వర్మ అంటే చాలా ఇష్టం అని చెప్పాడు.. కానీ ఆయన సినిమాలో అవకాశం ఎప్పుడు వస్తుందో అని రీతూ వర్మ అడగనే అడిగింది. మరి ఈ రెండు సినిమాల్లో రీతూ వర్మ కి వచ్చిన పేరు తో ఆమెకి అవకాశాలు వస్తే ఓకె.. లేదంటే పెళ్లి చూపులు తర్వాత అమ్మడు.. తమిళ, మలయాళ భాషలకు తరలిపోవాల్సి వచ్చింది. అక్కడ సక్సెస్ అయ్యాకే మళ్ళీ రీతూ కి ఇక్కడ తెలుగులో అవకాశాలు వచ్చాయి. మరి ఇక్కడ సక్సెస్ అయిన రీతూ వర్మ కి ఆఫర్స్ క్యూ కడతాయో.. లేదో.. చూడాలి.