Advertisementt

లాలా భీమ్లా.. అడవి పులి సాంగ్ వచ్చేసింది

Sun 07th Nov 2021 12:30 PM
lala bheemla song,bheemla nayak movie,trivikram,pawan kalyan,rana,nithya menon  లాలా భీమ్లా.. అడవి పులి సాంగ్ వచ్చేసింది
Bheemla Nayak: Lala Bheemla Song Out Now లాలా భీమ్లా.. అడవి పులి సాంగ్ వచ్చేసింది
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ - రానా కాంబో లో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించినప్పటి నుండి.. ఈ సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్ లో మొదలయ్యాయి. నేడు త్రివిక్రమ్ పుట్టిన రోజు స్పెషల్ గా భీమ్లా నాయక్ నుండి లాలా.. భీమ్లా సాంగ్ ని రిలీజ్ చేసారు మేకర్స్.

లాలా భీమ్లా అడవి పులి గొడవ పడి ఒడిసి పట్టు  దంచి కొట్టు కత్తి పట్టు అదరగొట్టు భీమ్లా నాయక్ పోరాట గీతం ఇది 

ఈచిత్రానికి సంభాషణలు, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న త్రివిక్రమ్, ఈ గీతాన్ని రచించటం విశేషం. మాటల్లో మాత్రమే కాదు పాటలో సైతం తనదైన శైలిని పలికించారన్నది స్పష్టం చేస్తుందీ గీతం.

పది పడగల పాము పైన పాదమెట్టిన సామి తోడు...

పిడుగులొచ్చి మీద పడితే కొండగొడుగు నెత్తినోడు... పాటలోని ఈ పదాలు వింటే నిజమనిపించక మానదు.

భీమ్లా నాయక్ పోరాట సన్నివేశాల్లో భాగంగా ఈ గీతం కనిపిస్తుంది. తమన్ స్వరాలు, అరుణ్ కౌండిన్య గాత్రం ఆవేశాన్ని రగిలిస్తే, రెండు నిమిషాల ముప్ఫై సెకన్లు ఉన్న ఈ పాటలో కనిపిస్తున్న దృశ్యాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. 

భీమ్లా నాయక్ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. 

LalaBheemlaSong> https://youtu.be/Enzj9nTHiEc

Bheemla Nayak: Lala Bheemla Song Out Now:

Lala Bheemla song from Bheemla Nayak launched, Trivikram brilliance as a lyricist shines through

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ