Advertisementt

నాకు బాడీ గార్డ్స్ లేరు: విజయ్ సేతుపతి

Sat 06th Nov 2021 11:08 PM
vijay sethupathi,vijay sethupathi talks about bangalore airport incident,bangalore airport incident  నాకు బాడీ గార్డ్స్ లేరు: విజయ్ సేతుపతి
Vijay Sethupathi about Bangalore Airport Incident నాకు బాడీ గార్డ్స్ లేరు: విజయ్ సేతుపతి
Advertisement
Ads by CJ

విజయ్ సేతుపతి అంటే.. తెలుగు, తమిళ, హిందీ ఇలా ఏ భాషలో అయినా సూపర్ హీరోనే. కేవలం హీరోగానే కాదు.. విలన్ గాను విజయ్ సేతుపతి ఓ బెంచ్ మార్క్ సెట్ చేసారు. అయితే స్టార్ హీరోలకి బాడీ గార్డ్స్, పర్సనల్ సెక్యూరిటీ అంటూ హడావిడి ఉంటుంది. లేకపోతే అభిమానులు మీదపడి హీరోలని తొక్కేస్తారు. కానీ విజయ్ సేతుపతి మాత్రం తనకి సెక్యూరిటీ అదే బాడీగార్డ్స్ అంటే ఇష్టం ఉండదు.. అందరితో ప్రేమగా ఉండడమే తెలుసు అంటున్నాడు. తాను ఎప్పుడు ట్రావెల్ చేసినా.. తన క్లోజ్ ఫ్రెండ్ తన వెంటే ఉంటాడు అని.. అతనే తనకు మేనేజర్ కూడా అని చెప్పాడు.

అయితే ఇదంతా విజయ్ సేతుపతి ఎందుకు చెప్పాడు అంటే.. ఈమధ్యన బెంగుళూర్ ఎయిర్ పోర్ట్ లో విజయ్ సేతుపతి పై ఓ వ్యక్తి వెనకగా వచ్చి ఎగిరి తన్నిన ఘటన వైరల్ అయ్యింది. ఆ ఎయిర్ పోర్ట్ ఘటనపై విజయ్ సేతుపతి స్పందిస్తూ.. తనపై దాడికి దిగిన వ్యక్తి తమతో పాటే విమానంలో ప్రయాణించాడని.. అయితే ఆ వ్యక్తికి, తన సిబ్బందికి మధ్య విమానంలోనే గొడవ మొదలైందని, విమానం దిగిన తర్వాత కూడా వివాదం కొనసాగిందని.. అతను ఒకొనొక సమయంలో మానసిక సమతుల్యత కోల్పోవడంతోనే తనపై దాడి చేశాడని.. ఈ గొడవని పోలీస్ స్టేషన్ లోనే పరిష్కరించుకున్నామని విజయ్ సేతుపతి బెంగుళూర్ దాడి ఘటనపై స్పందించాడు. 

Vijay Sethupathi about Bangalore Airport Incident:

Vijay Sethupathi talks about Bangalore Airport Incident

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ