బిగ్ బాస్ సీజన్ 5 ఏదో అలా అలా నడుస్తుంది. ఈ సీజన్ ని బుల్లితెర ప్రేక్షకులు అంతగా లైక్ చెయ్యడం లేదు. చప్పగా సాగుతున్న బిగ్ బాస్ కి నాగార్జున ఎపిసోడ్ హైలెట్. కాకపోతే ఈ వారం నాగార్జున శనివారం ఎపిసోడ్ లో మజా కనిపించలేదు. అంటే శనివారం వస్తే చాలు కంటెస్టెంట్స్ ని నించోబెట్టి.. తప్పు చేసిన వారికీ నాగ్ క్లాస్ పీకుతుంటాడు. ఈ వారం కూడా నాగార్జున రవిని నించోబెట్టి టెంక్షన్ పెట్టాడు. దోతి రవి అనగానే భయంగా లేచిన రవి క్లాప్స్ కొడుతూ నీకు మొన్న కెప్టెన్సీ టాస్క్ లో నరకం చూపించిన షణ్ణుకి నీ రేంజ్ లో రివెంజ్ తీర్చుకోమనగా రవి షణ్ముఖ్ కి ఎగ్ ఇంకా అన్ని రకాల రసాలు కలిపి తాగిపించాడు.
తర్వాత శ్రీరామా చంద్రని లేపి నీ రివెంజ్ ఎవరి మీద అనగానే రా సన్నీ అని పిలుస్తాడు.. సన్నీ ఇబ్బందిపడితే.. వద్దంటే క్విట్ చెప్పేయ్ అన్నాడు నాగ్. ఇక రా అని శ్రీరామ్ చంద్ర పిలవగానే.. ఉండవయ్యా మొగడా అంటూ నువ్వు నా మొగుడివి అంటూ నవరసాలు పలికించాడు సన్నీ. ఇక ఈ వారం ఏ ఒక్కరిని క్లాస్ పీకినట్లుగా నాగ్ కనిపించకపోయేసరి.. ఈ ప్రోమో చూసిన వారు.. అయ్యో నాగ్ క్లాస్ కూడా లేకపోతె మరీ బోర్ కదా అంటున్నారు. మరి ఈ ప్రోమో కటింగ్ అలా ఉందో.. నిజంగానే నాగ్ ఏం అనకుండా ఊరుకున్నాడో అనేది ఈ రోజు నైట్ ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది.