నాగ చైతన్యని పెళ్ళాడి పెద్దింటి కోడలిగా వెళ్ళిన తర్వాత కూడా సమంత గ్లామర్ విషయంలోనూ, సినిమాల విషయంలోనూ ఎక్కడా తగ్గలేదు. మరింత గ్లామర్ గా రెచ్చిపోయిన సమంత.. ఇప్పుడు చైతు నుండి డివోర్స్ తీసుకుని సింగిల్ అయ్యింది. ఇక ఓ రెండు నెలలపాటు బాధపడిన సమంత తాజాగా మునుపుటి ఉత్సాహంతో ఫోటో షూట్స్ కి ఫోజులిచ్చేసింది. రీసెంట్ గా మెగా ఫ్యామిలీ దివాళి సెలెబ్రేషన్స్ లో పాల్గొన్న సమంత తాజాగా పారితోషకం విషయంలో హైలెట్ అయ్యింది. ఫ్యామిలీ మ్యాన్ 2 తో పాన్ ఇండియా హీరోయిన్ అవతరమెత్తి.. శాకుంతలంతో సత్తా చాటడానికి రెడీ అయిన సమంత.. ఇప్పడు తెలుగు తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది.
అయితే డివోర్స్ తీసుకున్నాక సమంత కి వరస ఆఫర్స్ క్యూ కడుతున్నాయట. కాకపోతే సమంత తన క్రేజ్, దృష్ట్యా రెండు నుండి మూడు కోట్ల పారితోషకం డిమాండ్ చేస్తుందట. ఇప్పటివరకు రెండు కోట్ల లోపే ఉన్న సమంత ఇప్పుడు తెలుగు, తమిళ లో బైలింగువల్ మూవీస్ కోసం మూడు కోట్లు అందుకోబోతుంది అని, ప్రస్తుతం కథలు వింటున్న సమంత తన దగ్గరకొచ్చే నిర్మాతలకు మూడు కోట్లు పైన అయితే మాట్లాడమని చెబుతుందట. ఎలాగూ చైతు తో సపరేట్ అయ్యాక సినిమాలతో బిజీ అవ్వాలని సమంత కూడా వీలైనన్ని సినిమాలు చెయ్యడానికి రెడీ అవుతున్నా ఆమె పారితోషకం చూసి మేకర్స్ ఆలోచనలో పడుతున్నట్లుగా తెలుస్తుంది.