Advertisementt

చిరు 154 మాస్ లుక్ ఫాన్స్ కి పూనకాలే

Sat 06th Nov 2021 12:29 PM
chiranjeevi,chiru 154 launched,chiru 154 first look out,director bobby,chiranjeevi in a powerful mass avatar,moola virat darshanam,arachakam arambham,rock star devi sri prasad,mythri movie makers  చిరు 154 మాస్ లుక్ ఫాన్స్ కి పూనకాలే
Chiru154 launched, first look out చిరు 154 మాస్ లుక్ ఫాన్స్ కి పూనకాలే
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరు అంటేనే మాస్.. మాస్ అభిమానులు భీబత్సంగా ఉన్న హీరో మెగాస్టార్. చిరు మాస్ అవతార్ లో కనిపించారంటే ఫాన్స్ కి పూనకాలే.. థియేటర్స్ దగ్గర అరాచకమే. బాక్సాఫీసు వీరుడు మెగాస్టార్ తో దర్శకుడు బాబీ 154 మూవీ చేస్తున్నాడు. నేడు అధికారికంగా పూజా కార్యక్రమాలతో బాబీ - చిరు 154 ప్రాజెక్ట్ మొదలైంది. ఉదయం 11.43 నిమిషాల ముహూర్తంతో మొదలైన చిరు 154 ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ 12 గంటల తర్వాత రిలీజ్ చేసారు. ప్రీ లుక్ లో పూనకాలు లోడింగ్ అంటూ ఆసక్తిని రేపిన బాబీ.. ఫస్ట్ లుక్ లో చిరు ని ఎలా చూపిస్తాడో అనే ఆసక్తి, ఆత్రుత మెగా ఫాన్స్ లో పెరిగిపోయింది. 

మరి మెగా ఫాన్స్ అంచనాలకు తగ్గకుండా చిరు 154 లో చిరు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు మేకర్స్. మాస్ అవతార్ లో చిరు 154 లుక్ అదిరింది. నోటిలో బీడీ, చేతిలో లైటర్ తో చిరు మాస్ అవతారానికి మెగా ఫాన్స్ కి నిజంగా పూనకాలే. బాబీ చెప్పినట్టుగా పూనకాలు తో అరాచకం ఆరంభం అంటూ మెగాస్టార్ 154 మూవీ ఫస్ట్ లుక్ పై రాసారు. మరి మాస్ అవతార్ లో చిరు - బాబీ ప్రాజెక్ట్ తో భీభత్సమైన అంచనాలను క్రియేట్ చేసారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ క్రేజీ మూవీ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ అయ్యారు. హీరోయిన్ గా బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా పేరు వినిస్తుంది. 

Chiru154 launched, first look out:

Mega Star 154: Moola Virat Arachakam Arambham

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ