Advertisementt

సుమ కనకాల జయమ్మ పంచాయితీ

Sat 06th Nov 2021 12:07 PM
ram charan,suma kanakala,vijay kumar kalivarapu,jayamma panchayathi movie,vennela creations,production no 2,jayamma panchayathi first look  సుమ కనకాల జయమ్మ పంచాయితీ
Suma Kanakala Jayamma Panchayathi First Look సుమ కనకాల జయమ్మ పంచాయితీ
Advertisement
Ads by CJ

టాలీవుడ్ టాప్ యాంకర్ సుమ కనకాల అంటే ఈ రోజుకి ఫాన్స్ కి మాత్రమే కాదు.. తెలుగు ప్రేక్షకులందరికీ ఎనలేని ఇష్టం, గౌరవం. మలయాళం నుండి తెలుగులోకి వచ్చి తెలుగు యాంకర్స్ ని తొక్కేసి.. తెలుగు స్పష్టంగా మట్లాడుతూ హిలేరియస్ కామెడీ పండిస్తూ రకరకాల షోస్ తో, టాప్ స్టార్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో.. ఇప్పటికి సుమ కనకాల.. 40 ప్లస్ వయసులోనూ దూసుకుపోతుంది. టాలెంట్ ముందు అందం దిగదుడుపు అని సుమ నిరూపించింది. ఇక బుల్లితెర మీద టాప్ వన్ లో ఉన్న సుమ కనకాల యాంకర్ కాకముందు వెండితెర మీద అప్పుడప్పుడు మెరిసింది. బుల్లితెర మీదకి వచ్చాక వెండికి తెరకి దూరమైన సుమ కనకాల మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద ఎంట్రీ ఇవ్వబోతుంది. విజయ్ కుమార్ దర్శకత్వంలో సుమ కనకాల మూవీ ప్రీ లుక్ తో అంచనాలు రేపింది.

అన్ని కేరెక్టర్స్ అంటే రిచ్, గ్లామర్, అలాగే మిడిల్ క్లాస్ అమ్మాయిగా రకరకాల గెటప్స్ వేసిన సుమ సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రీ ఇవ్వబోయే మూవీ లో ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి అందరిలో మోడలింది. నేడు రామ్ చరణ్ చేతుల మీదుగా సుమ కనకాల కీలక పాత్రలో నటిస్తున్న జయమ్మ పంచాయితీ ఫస్ట్ లుక్ ని లాంచ్ చేసారు. ఈ ఫస్ట్ లుక్ లో జయమ్మ గా సుమ చాలా నేచురల్ గా కనిపిస్తుంది. వెంకట్ అంటూ చేతి మీద పచ్చబొట్టు వేసుకుని ప్రీ లుక్ తోనే అందరిలో ఆసక్తిని రేపిన సుమ.. ఇప్పుడు జయమ్మ గా ఎలాంటి పంచాయితీ చెయ్యబోతుందో గాని.. ఫస్ట్ లుక్ లో మాత్రం సుమ చాలా డిఫ్రెంట్ గా కనిపిస్తుంది. 

Suma Kanakala Jayamma Panchayathi First Look :

Ram Charan Launched First Look Of Suma Kanakala, Vijay Kumar Kalivarapu Jayamma Panchayathi