Advertisementt

చిరు తో వర్క్.. అది నా కల

Sat 06th Nov 2021 11:12 AM
director bobby,megastar chiru,chiru 154,bobby - chiru movie opening today  చిరు తో వర్క్.. అది నా కల
Director Bobby Tweet on Megastar చిరు తో వర్క్.. అది నా కల
Advertisement
Ads by CJ

మెగాస్టార్ తో పని చెయ్యాలని ఎవరికి ఉండదు. ఈమధ్యన మెగాస్టార్ చిరు ప్లాప్ దర్శకుల పాలిట దేవుడి మాదిరిగా వాళ్లతో సినిమాలు కమిట్ అయ్యాడు. మెహెర్ రమేష్ తో భోళా శంకర్ ని రేపు 11 వ తారీఖున మొదలు పెట్టబోతున్నాడు. అలాగే దర్శకుడు బాబీ తో మెగాస్టార్ 154 ని ఈ రోజు పట్టాలెక్కించడానికి రెడీ అయ్యారు. అయితే చిరు తో సినిమా చెయ్యబోతున్న దర్శకుడు బాబీ తెగ ఎగ్జైట్ అవుతున్నాడు.. సోషల్లో మీడియాలో చిరు తో తాను ఎప్పుడో పద్దెనిమిదేళ్ల క్రితం దిగిన పిక్ ని పోస్ట్ చేస్తూ.. 

మెగాస్టార్, ఆయన పేరు వింటే...అంతు లేని ఉత్సాహం !

ఆయన పోస్టర్ చూస్తే..అర్ధం కాని ఆరాటం !

తెర మీద ఆయన కనబడితే...ఒళ్ళు తెలీని పూనకం ! ❤️

పద్దెనిమిదేళ్ల క్రితం....ఆయన్ని మొదటి సారి కలసిన రోజు కన్న కల... నిజమవుతున్న ఈ వేళ మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాను.🙏 అంటూ పూనకాలు(వర్ర్కింగ్ టైటిల్) ఓపెనింగ్ సందర్భంగా తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని దర్శించిన మరీ సోషల్ మీడియాలో ట్వీట్ చేసాడు.. అన్నట్టు చిరు - బాబీ సినిమా ఈరోజే 11.43గంటలకు పూజా కార్యక్రమాలు జరుపుకోబోతుంది. 

Director Bobby Tweet on Megastar :

Director Bobby - Megastar Chiru Movie opening today

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ