Advertisementt

ఆక్సిడెంట్ తర్వాత మెగా హీరోలతో సాయి ధరమ్

Fri 05th Nov 2021 09:30 PM
sai dharam tej,mega family,mega heroes,chiranjeevi,pawan kalyan,naga babu,ram charan,allua rjun,varun tej,akeera  ఆక్సిడెంట్ తర్వాత మెగా హీరోలతో సాయి ధరమ్
Sai Dharam Tej appearance after Accident ఆక్సిడెంట్ తర్వాత మెగా హీరోలతో సాయి ధరమ్
Advertisement
Ads by CJ

వినాయకచవితి రోజున చిరు మేనల్లుడు, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ ఆక్సిడెంట్ లో గాయాలపాలయ్యి హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో దాదాపుగా 35 రోజుల పాటు ట్రీట్మెంట్ లో ఉన్నాడు. అయితే సాయి ధరమ్ భుజానికి సర్జరీ రెండుసార్లు అవ్వగా.. తర్వాత ఓకల్ కార్డు ఆపరేషన్ కూడా అయ్యింది. ఇక ఎప్పటికప్పుడు సాయి ధరమ్ తేజ్ హెల్త్ అప్ డేట్ వస్తున్నా.. సాయి ధరమ్ ఇంతవరకు ఫాన్స్ కి కానీ.. ఎవరికీ కనిపించలేదు. దసరా రోజు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళాక కూడా సాయి ధరమ్ మాత్రం బయటికి కనిపించలేదు.. సాయి ధరమ్ యాక్సిడెంట్ వలన చిక్కిపోయాడని,ఫేస్ లో గ్లో పోవడం వలనే సాయి తేజ్ ఫేస్ కనిపించకుండా కవర్ చేస్తూ చేతి వేళ్ళు, చెయ్యి మాత్రమే చూపిస్తున్నారని అన్నారు.

ఇక దాదాపు రెండు నెలల తర్వాత సాయి ధరమ్ దర్శన భాగ్యం మెగా ఫాన్స్ కి దక్కింది. దివాళి రోజున మెగా ఫ్యామిలీ లో పార్టీ జరిగింది. ఆ పార్టీలో చరణ్, అల్లు ఇంకా మెగా హీరోలు కనిపించినా సాయి ధరమ్ కనిపించలేదు. ఇక తాజాగా మెగాస్టార్.. మేనల్లుడు ని సోషల్ మీడియా ద్వారా అందరికి చూపించేసారు. అందరి ఆశీస్సులు దీవెనలు ఫలించి.. సాయి ధరమ్ తేజ్  పూర్తి గా కోలుకున్నాడు. మా కుటుంబసభ్యులందరికి ఇది నిజమైన పండుగ.. అంటూ దివాళీ రోజున సాయి ధరమ్ తేజ్ చుట్టూ చిరు, నాగబాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, వైష్ణవ తేజ్ ఆఖరికి పవన్ కొడుకు అకీరా తో పాటుగా ఉన్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. సాయి ధరమ్ తో కేక్ కూడా కట్ చేయించారు. ఇక అక్కడ మెగా హీరోలంతా ఉన్నప్పటికీ.. రెండు నెలల తర్వాత కనబడిన సాయి ధరమ్ వైపే అందరి చూపు. స్

సాయి ధరమ్ తేజ్ నీట్ గా టక్ చేసుకుని.. స్టయిల్ గానే నీట్ గా ఉన్నప్పటికీ.. సాయి తేజ్ బాగా సన్నబడి కనిపిస్తున్నాడు. ఇక సాయి తేజ్ ఫేస్ లో ఆయన స్మైల్ కి మెగా ఫాన్స్ పడిపోతున్నారు. 

Sai Dharam Tej appearance after Accident:

Sai Dharam Tej with his mega family 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ