సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే ఫాన్స్ లో విపరీతమైన క్రేజ్, అంచనాలు.. కానీ సూపర్ స్టార్ట్ రజినీకాంత్ తన సినిమాలతో కొన్నేళ్లుగా ఆ అంచనాలు అందుకోలేక చేతులెత్తేస్తున్నారు. అందులో రజినీకాంత్ తప్పేం లేదు. ఆయన ఎనర్జీ, ఆయన స్టయిల్ లో ఎలాంటి మార్పు లేదు. కానీ దర్శకులే రజినీకాంత్ కోసం పవర్ ఫుల్ కథని తేలేకపోతున్నారు. నాలుగు యాక్షన్ సీన్స్, రెండు పాటలు, హీరోయిజం హైలెట్స్ చేసే సీన్స్ తప్ప రజిని కోసం ప్రత్యేకంగా కథ తెచ్చి అద్భుతంగా తెరకెక్కించే దర్శకులు కనిపించడం లేదు. టాప్ డైరెక్టర్ మురుగదాస్, శివ లాంటి దర్శకులు కూడా రజినీకాంత్ ఫాన్స్ కోసం ఈ సినిమా తీశారు తప్ప.. అందులో ప్రత్యేకతే లేదు. తాజాగా సూపర్ స్టార్ పెద్దన్న కూడా అదే కోవలోకి వస్తుంది.
యాక్షన్ అండ్ కమర్షియల్ డైరెక్టర్ శివ రజినీకాంత్ ని పెద్దన్నగా చూపించాడు. పూర్ రివ్యూస్, నెగెటివ్ టాక్ తో ఈ సినిమా కూడా డిజాస్టర్స్ లిస్ట్ లోకి చేరిపోయింది. ఇక వరస ప్లాప్ లతో సూపర్ స్టార్ రజినీకాంత్ మర్కెట్ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడో పడిపోయింది. తాజాగా పెద్దన్నని కేవలం 12 కోట్లకి తీసుకున్నారు నిర్మాతలు. ఇప్పుడు అవి కూడా వచ్చేలా కనిపించడం లేదు.. పెద్దన్న ఫస్డ్ డే కలెక్షన్స్ మీ కోసం..
ఏరియా కలెక్షన్స్(కోట్లలో)
నైజాం - 0.53
సీడెడ్ - 0.24
అర్బన్ ఏరియాస్ - 0.16
ఈస్ట్ గోదావరి - 0.12
వెస్ట్ గోదావరి - 0.09
గుంటూరు : - 0.25
కృష్ణ - 0.11
నెల్లూరు - 0.10
ఏపీ-టీఎస్ టోటల్ - 1.60 కోట్లు (2.65కోట్ల గ్రాస్)
ఇతర ప్రాంతాలు 0.10
ఓవర్సీస్ 0.62
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 2.31కోట్లు(2.45 కోట్లు గ్రాస్)