రవితేజ ప్రస్తుతం వరస సినిమాల లైన్ అప్ తో ఫాన్స్ కి ట్రీట్స్ మీద ట్రీట్స్ ఇచ్చేస్తున్నాడు. ఖిలాడీ సినిమా షూటింగ్ ఫినిష్ చేసి.. రామ రావు ఆన్ డ్యూటీ చేస్తున్న రవితేజ.. తదుపరి త్రినాధ్ రావు నక్కిన తో ఢమాకా మూవీ చేస్తున్నాడు. అంతేకాదు.. రవితేజ మైల్డ్ స్టోన్ మూవీ RT70 ని సుధీర్ వర్మ దర్శకత్వంలో కమిట్ అయ్యాడు. దివాళి స్పెషల్ గా సుధీర్ వర్మ - రవితేజ కాంబో టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని ఈ రోజు అంటే నవంబర్ 5 న రిలీజ్ చేసింది టీం. రవితేజ రావణాసుర గా డిఫ్రెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. నిజంగానే రావణాసుర గా ఫస్ట్ లుక్ టైటిల్ ఆకట్టుకుంది.
ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతుంది అని.. మిగతా వివరాలు త్వరలోనే అని ప్రకటించారు మేకర్స్. అయితే ఈ సినిమా తర్వాత రవితేజ పాన్ ఇండియా మార్కెట్ కి వెళ్లబోతున్నాడు. అది RT71 ని టైగర్ నాగేశ్వరరావు అంటూ పాన్ ఇండియా ఫిలిం ని ఈ దివాళి స్పెషల్ గానే ప్రకటించాడు రవితేజ.. క్రాక్ హిట్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో రవితేజ సినిమాల లైనప్ మాములుగా లేదు.