పాన్ ఇండియా మూవీస్, క్రేజీ మూవీస్, టాప్ స్టార్స్ మూవీస్ కి సంబందించిన అప్ డేట్స్ తో ఈ దివాళి మాములుగా ఉండేలా లేదు. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ నుండి.. బాలకృష్ణ అఖండ మూవీ వరకు, ఇంకా చిన్నా పెద్ద మూవీస్ అప్ డేట్స్ నవంబర్ 4 దివాళి స్పెషల్ అంటూ అప్ డేట్స్ మీద అప్ డేట్స్ ఇస్తూ మేకర్స్ హంగామా చేస్తున్నారు. మరి ప్రభాస్ రాధేశ్యామ్ నుండి ఎలాంటి అప్ డేట్ రాబోతుంది. నిన్నటివరకు రాధేశ్యామ్ నుండి ప్రేరణ గ్లిమ్ప్స్ రాబోతున్నాయి.. అది కూడా దివాళి కి అంటూ ప్రచారం జరిగింది. కానీ రాధేశ్యామ్ మేకర్స్ నుండి ఎలాంటి అప్ డేట్ లేదు.
ప్రభాస్ బర్త్ డే స్పెషల్ గా విక్రమాదిత్యగా ప్రభాస్ గ్లిమ్ప్స్ ఇచ్చారు. ఇక పూజ హెగ్డే ప్రేరణ గ్లిమ్ప్స్ దివాళి స్పెషల్ గా రాబోతున్నాయని అన్నారు. కానీ మేకర్స్ ఆ విషయమై ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా సస్పెన్స్ లో పెట్టారు. మరి ఈ దివాళి కి రాధేశ్యామ్ నుండి ఎలాంటి సర్ ప్రైజ్ లేదనే అనుకోవాలా.. అంటూ ప్రభాస్ ఫాన్స్ తో పాటుగా పూజ హెగ్డే ఫాన్స్ కూడా తెగ ఫీలైపోతున్నారు. ఎందుకంటే నిన్నగాక మొన్న ఆర్.ఆర్.ఆర్ గ్లిమ్ప్స్ సోషల్ మీడియాని వూపేసాయి. ఇక ఇప్పుడు భీమ్లా నాయక్, ఆచార్య, అఖండ లాంటి మూవీస్ ట్రెండ్ అవుతుంటే.. ప్రభాస్ ఫాన్స్ ఫీలవ్వాల్సి వస్తుంది. మరి ఈ దివాళికి రాధేశ్యామ్ బ్లాస్ట్ ఉంటుందో.. లేదో.. చూద్దాం.