Advertisementt

నిన్న నాగ్.. ఈ రోజు రామ్ చరణ్

Wed 03rd Nov 2021 03:02 PM
nagarjuna,ramcharan,paid condolences,shiva rajkumar,puneeth rajkumar family  నిన్న నాగ్.. ఈ రోజు రామ్ చరణ్
Ramcharan paid condolences to Puneeth Rajkumar family నిన్న నాగ్.. ఈ రోజు రామ్ చరణ్
Advertisement
Ads by CJ

కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో టాలీవుడ్ లో చిన్నా పెద్దా హీరోలంతా కన్నీరుమున్నీరు అవడమే కాదు.. పునీత రాజ్ కుమార్ ఆఖరి చూపు కోసం బెంగుళూరు కి వెళ్లి ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. మెగాస్టార్ చిరంజీవి దగ్గరనుండి.. జూనియర్ ఎన్టీఆర్ వరకు, బాలకృష్ణ, వెంకీ, శ్రీకాంత్, నరేష్ ఇలా చాలామంది పునీత్ ఆఖరి చూపుల కోసం బెంగుళూర్ వెళ్లారు. అయితే కొంతమంది ఆ సమయంలో విపరీతమైన బిజీ షెడ్యూల్ వలన వెళ్లలేకపోవడంతో.. తాజాగా పునీత్ సమాధి ని సందరిస్తూ ఫ్యామిలి మెంబెర్స్ ని పరామర్శిస్తున్నారు. 

నిన్న నాగార్జున పునీత్ రాజ్ కుమార్ సమాధి ని సందర్శించి నివాళులు అర్పించడమే కాకుండా శివరాజ్ కుమార్ ని పునీత్ ఫ్యామిలీ మెంబెర్స్ ని పరామర్శించి.. మీడియాతో మాట్లాడారు.. పునీత్ చాలా మంచివాడు.. ఆయన ఫ్యామిలీకి, అభిమానులకి, కన్నడ ప్రజలకి డీప్ కండోలెన్సు అంటూ నాగ్ ఎమోషనల్ అయ్యారు. ఇక నేడు రామ్ చరణ్ బెంగుళూరు వెళ్లి పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీ మెంబెర్స్ ని, శివ రాజ్ కుమార్ ని పరామర్శించి వచ్చారు. నిన్నటి వరకు రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో RC15 సాంగ్ షూటింగ్ లో బిజీగా ఉండడంతో.. నేడు బెంగుళూరుకి వెళ్లి పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సబ్యులని పరామర్శించారు. 

Ramcharan paid condolences to Puneeth Rajkumar family:

Nag and Ramcharan paid condolences to Puneeth Rajkumar family

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ