Advertisementt

రవితేజ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ

Wed 03rd Nov 2021 01:20 PM
rt71,raviteja,pan india entertainer,tiger nageswara rao movie,abhishek agarwal arts banner,obinhood of stuartpuram,andhra pradesh,gv. prakash kumar music director,madhie cinematographer  రవితేజ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
RT71 update out రవితేజ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Advertisement
Ads by CJ

హీరో రవితేజ క్రాక్ మూవీ హిట్ తర్వాత ఆయన సినిమాల లైన్ అప్ మాములుగా లేదు. వరస కమిట్ మెంట్స్ తో యంగ్ హీరోలకి షాకిస్తున్నాడు. క్రాక్ తర్వాత రమేష్ వర్మతో ఖిలాడీ పూర్తి చేసేసిన రవితేజ.. ఆ తర్వాత శరత్ మండా తో రామారావు ఆన్ డ్యూటీ అన్నాడు. ఆ తర్వాత త్రినాధ్ రావు నక్కిన తో డమకా పేల్చబోతున్న రవితేజ.. తదుపరి మూవీ RT70 ని సుధీర్ వర్మ దర్శకత్వంలో చెయ్యబోతున్నాడు. ఆ సినిమా అప్ డేట్ రేపు దివాళి స్పెషల్ గా రాబోతుంది. RT70 టైటిల్ గా రావణాసుర టైటిల్ ప్రచారంలో ఉంది. ఇక ఆ వెంటనే RT71 అంటూ రవితేజ ఫాన్స్ కి మరో సర్ ప్రైజ్ న్యూస్ చెప్పాడు.

RT71 ని పాన్ ఇండియా మూవీ గా ప్రకటించి షాకిచ్చాడు. రవితేజ తన 71 వ చిత్రాన్ని టైగర్ నాగేశ్వర రావు గా పాన్ ఇండియా లెవల్లో సినిమా ని ప్రకటించాడు. కిట్టు ఉన్నాడు జాగ్రత్త ఫేమ్ వంశి దర్శకత్వంలో.. అభిషేక్ పిక్చర్స్ నిర్మాణంలో రవితేజ ఈ టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ పని చేస్తున్నాడు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్, కన్నడ ఇలా టైగర్ నాగేశ్వర రావు ఆరు భాషల్లో తెరకెక్కుతున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. ఇక ఇదే రవితేజకి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అవ్వడం గమనార్హం. 

RT71 update out:

RT71 update out: Raviteja pan India entertainer is Tiger Nageswara Rao

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ