బాలకృష్ణ - బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న అఖండ మూవీ పై మార్కెట్ లోనే కాదు.. ఫాన్స్ లోనూ, సాధారణ ప్రేక్షకులల్లోను భారీ అంచనాలే ఉన్నాయి. మే నెలలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన అఖండ మూవీ కరోనా క్రైసిస్ వలన పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అయితే అఖండ రిలీజ్ డేట్ పై రోజు రోజుకి ఉత్కంఠ పెరిగిపోతుంది. డిసెంబర్ క్రిష్ట్మస్ స్పెషల్ గా అఖండ రిలీజ్ అని, కాదు కాదు.. సంక్రాంతి బరిలో అని ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్, ఫస్ట్ సింగిల్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచేసింది.
ఇక తాజాగా ఈ రోజు అఖండ అప్ డేట్ ఇస్తున్నామని.. సాయంత్రం 5.35 నిమిషాలకి కి అఖండ అప్ డేట్ అనగానే ఫాన్స్ లో క్యూరియాసిటీ, ఉత్కంఠ మరింతగా పెరిగిపోయింది. అంటే అఖండ రిలీజ్ డేట్ పై మేకర్స్ ఏం చెబుతారో అనే ఆసక్తి అంతకంతకు పెరిగిపోయింది. అనుకున్నట్టుగానే అఖండ అప్ డేట్ వచ్చేసింది. అయితే అది రిలీజ్ డేట్ ప్రకటన కాదు.. అఖండ నుండి సాంగ్ టీజర్ ని దివాళీ కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. #Akhanda song teaser on 4th November at 11:43 AM #AkhandaMusicalRoar దివాళీ రోజున అఖండ సాంగ్ టీజర్ ని ఉదయం 11.43 నిమిషాలకు రిలీజ్ చెయ్యబోతున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య అఘోర గా, సూపర్ స్టైలిష్ గా రెండు పాత్రల్లో కనిపించబోతున్నారు. ప్రగ్య జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ గాను, పవర్ ఫుల్ విలన్ గా హీరో శ్రీకాంత్ నటిస్తున్నాడు.