గత ఏడాది కరోనా పాండమిక్ సిట్యువేషన్ లో థియేటర్స్ యాజమాన్యాలతో గొడవపడి మరీ .. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఆకాశం నీ హద్దురా మూవీని అమెజాన్ ప్రైమ్ ఓటిటి నుండి రిలీజ్ చేసి భారీ హిట్ అందుకున్నాడు. సుధా కొంగర దర్శకత్వంలో సూర్య ఆకాశం నీ హద్దురా అంటూ నిజంగానే ఆకాశమంత హిట్ కొట్టేసాడు,. ఇక తాజాగా అదే అమెజాన్ ప్రైమ్ నుండి సూర్య మరో అద్భుతమైన హిట్ అందుకున్నాడు. సూర్య హీరోగా జ్ఞానవేల్ డైరెక్షన్స్ లో సూర్య, జ్యోతిక నిర్మించిన జై భీం అమెజాన్ ప్రైమ్ నుండి రిలీజ్ అయ్యి నేరుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూర్య లాయర్ గా నటించిన జై భీం పోస్టర్, టీజర్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచేసింది.
ఇక నేడు అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన జై భీం మూవీ కి సూపర్ హిట్ టాక్ రావడమే కాదు.. క్రిటిక్స్ కూడా సూపర్ రివ్యూస్ ఇవ్వడం, సోషల్ మీడియాలో జై భీం కి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. సినిమాలో సూర్య పెరఫార్మెన్స్, కోర్టు సన్నివేశాల్లో సూర్య పలికిన హావభావాలు వేరే లెవల్ అంటున్నారు. ఇంకా జ్ఞానవేల్ దర్శకత్వం, జై భీం కథ, అలాగే టెక్నీకల్ గా సినిమా చాలా బావుంది అంటునాన్రు. కాకపోతే అక్కడక్కడా స్లో నేరేషన్, అలాగే ఎడిటింగ్ జై భీం కి మైనస్ పాయింట్స్. షాన్ రొనాల్డ్ సంగీతం సో సో గ ఉన్నా... కోర్టు సన్నివేశాలు ఎలివేట్ అయ్యేలా ఇచ్చిన నేపథ్య సంగీతం సూపర్ అంటున్నారు. మరి ఓటిటి అమెజాన్ నుండి సూర్య జై భీం తో హీరోగానూ, నిర్మాతగానూ మరో హిట్ కొట్టేసాడు.