Advertisementt

కోపం తో ఊగిపోయిన జబర్దస్త్ జేడ్జ్ మనో

Tue 02nd Nov 2021 01:22 PM
extra jabardasth,mano,roja,rocking rakesh,bhasker,jabardasth judge mano  కోపం తో ఊగిపోయిన జబర్దస్త్ జేడ్జ్ మనో
Jabardasth Judge Mano expressed his anger over Rocking Rakesh కోపం తో ఊగిపోయిన జబర్దస్త్ జేడ్జ్ మనో
Advertisement
Ads by CJ

జబర్దస్త్ కామెడీ షో గత తొమ్మిదేళ్లుగా సక్సెస్ ఫుల్ గా సాగుతున్న కామెడీ షో. ఎన్ని షోస్ జబర్దస్త్ కి స్పాట్ పెడదామని చూసినా.. ఆ కామెడీ షో ని కొట్టే షో ఇంకా పుట్టలేదు. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ ఈటీవీలో మల్లెమాల దూసుకుపోతుంది. అయితే ఈ మధ్యన ఆ కామెడీ కాస్త ఊపు తగ్గి టీఆర్పీ పడిపోతుండడంతో.. జబర్దస్త్ లో కూడా కాంట్రవర్సీలు మొదలైపోయాయి. మొన్నా మధ్యన హైపర్ ఆది ఓ యూట్యూబ్ ఛానల్ యాంకర్ ని తీసుకురాగా.. అతను అనసూయ డ్రెస్ ల పై కామెంట్స్ చెయ్యగా.. అనసూయ అలిగి వెళ్లిపోయిన ప్రోమో తెగ వైరల్ అయ్యింది.

తాజాగా జబర్దస్త్ లో మరో ప్రోమో యూట్యూబ్ లో వైరల్ గా మారింది. అది వచ్చే శుక్రవారం జబర్దస్త్ కామెడీ షో లో జేడ్జ్ మనో రాకేష్ పై కోపం తెచ్చుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. భాస్కర్ స్కిట్, ఇంకా కొన్ని కామెడీ స్కిట్స్ అయ్యాక జబర్దస్త్ స్టేజ్ పై రాకేష్ స్కిట్ చూసిన మనో ఏంటిది రాకేష్ నీమీద ఎంత గౌరవం ఉంది అనగా.. దానికి రాకేష్ కామెడీ సర్ అన్నాడు. కామెడీ నా ఇది అని మనో కోపంతో లేచి వెళ్ళబోయాడు.. రోజా ఆపినా ఆగలేదు. మనో వెళ్లకుండా అడ్డుకున్న రాకేష్ టీం సభ్యులను.. పైకి వెళ్లండి అని రాకేష్ చెప్పగా.. నువ్వు కూడా వేళ్ళు అంటూ కోపంతో చెబుతాడు మనో. ఐ యామ్ సారి సార్ అంటూ రాకేష్ అంటున్నా.. చేయితో కొట్టబోతాడు మనో. దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. మరో ఇది ప్రోమో కోసం చేసారా.. లేదంటే నిజమా అనేది వచ్చే వారం జబర్దస్ చూస్తే క్లారిటీ వస్తుంది. 

Jabardasth Judge Mano expressed his anger over Rocking Rakesh:

Extra Jabardasth Latest Promo - 5th November 2021

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ