బాలీవుడ్ లో గ్లామర్ గర్ల్స్ గా పేరున్న హీరోయిన్స్ సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్. వీరిద్దరూ పర్సనల్ వెకేషన్స్ అంటూ మాల్దీవ్స్, బీచ్ లకి వెళ్ళినప్పుడు రెచ్చిపోయి బికినీ షో చెయ్యడం సోషల్ మీడియాలో తరచూ చూస్తూనే ఉన్నాం. సారా అలీ ఖాన్ అయితే అన్న తో కలిసి వెకేషన్స్ కి వెళితే.. జాన్వీ కపూర్ చెల్లి ఖుషి కపూర్, అలాగే ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్స్ కి వెళుతుంది. బీచ్ ల వెంట జాన్వీ అందాలు ఆరబోత ఓ రేంజ్ లో ఉంటుంది. అలాగే జిమ్ వేర్ లోనూ సారా అలీ ఖాన్, జాన్వీ లు పోటాపోటీగా అందాలు ఆరబోస్తారు.
అలాంటి హీరోయిన్స్ ఎప్పుడూ గ్లామర్ గా ఉంటే ఏం బావుంటుంది అనుకున్నారేమో.. పద్దతిగా ఈ భామలిద్దరూ కలిసి త్రియుగినారాయణ్ టెంపుల్ కి దైవ దర్శనానికి వెళ్ళరు. చక్కగా పద్దతిగా ట్రెడిషనల్ గా డ్రెస్ చేసుకుని జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ లు దైవ దర్శనం చేసుకోవడమే కాదు.. వీరు ట్రెడిషనల్ గా కలిసి తీయించుకున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ పిక్స్ చూసిన నెటిజెన్స్ గ్లామర్ భామలకు దైవం మీద భక్తి కలిగిందే అంటున్నారు.