Advertisementt

మెగాస్టార్ ని లైట్ తీసుకుంటున్నారా

Mon 01st Nov 2021 12:03 PM
film industry,chiranjeevi,nagarjuna,producers,ap ministers,ap cm jagan mohanreddy,ap government  మెగాస్టార్ ని లైట్ తీసుకుంటున్నారా
The film industry is taking Megastar lightly మెగాస్టార్ ని లైట్ తీసుకుంటున్నారా
Advertisement
Ads by CJ

సినిమా ఇండస్ట్రీలోని సమస్యల పరిష్కారానికై ఏపీ ప్రభుత్వం తో భేటీ కోసం చిరంజీవి, నాగార్జున మరికొందరు బడా నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్న టైం లో పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ఈవెంట్ లో ఏపీ ప్రభుత్వపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ చీల్చి చెండాడడంతో.. ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం వలన ప్రోబ్లెంస్ వస్తాయనే భయంతో టాలీవుడ్ బడా నిర్మాతలు చిరుకి చెప్పా చెయ్యకుండానే ఏపీ మినిస్టర్ ని కలిశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు చిరు బాధపడ్డారని ఏపీ మంత్రి అన్నప్పటికీ.. చిరు, పవన్ లు అన్నదమ్ములు. మొన్నొక పెళ్ళిలో పబ్లిక్ గానే నవ్వుకున్నారు, మాట్లాడుకున్నారు. అయితే పవన్ వ్యాఖ్యల ఫలితం సినిమా ఇండస్ట్రీ నిర్మాతలు, పెద్దలు ఇప్పుడు చిరుని పక్కనపెట్టారేమో అనే అనుమానాలు అందరిలో మొదలయ్యాయి.

ఎందుకంటే.. నాగార్జున రీసెంట్ గానే కొందరి నిర్మాతలతో కలిసి ఏపీ సీఎం జగన్ ని కలిసి మాట్లాడి లంచ్ కూడా చేసారు. జగన్ నాకు మంచి స్నేహితుడు.. చూసి చాలా రోజులయ్యింది. అందుకే చూడడానికి వచ్చా అని మీడియాకి చెప్పాడు నాగ్. అలాంటప్పుడు ఒక్కడే రావాలి కానీ.. ఆయన వెంట నిర్మాతలెందుకు.. అదొక డౌట్. ఇక తాజాగా దిల్ రాజు ఏపీ మినిస్టర్ నాని కి కలవడం చూస్తే ఇండస్ట్రీ మొత్తం మెగాస్టార్ చిరు ని లైట్ తీసుకున్నారనే అనిపిస్తుంది. నిన్నమొన్నటివరకు కలిసి తిరిగిన చిరు ఇండస్ట్రీ పెద్దలు ఇప్పుడు ఎవరికీ వారే ఏపీ ప్రభుత్వంలో ఇండస్ట్రీ సమస్యలపై మీటింగ్ పెడుతున్నారు తప్ప చిరు సలహాలు, సంప్రదింపులు ఏం కనిపించడం లేదు. అందుకే అనేది చిరు ని లైట్ తీసుకుంటున్నారు అని.. 

The film industry is taking Megastar lightly:

The film industry is taking Megastar Chiranjeevi lightly

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ