Advertisementt

ఆర్.ఆర్.ఆర్ గ్లిమ్ప్స్ వేరే లెవెల్

Mon 01st Nov 2021 11:39 AM
rrr,rrr first glimpse,rrr mind-blowing roar,ram charan,ntr,rajamouli,alia bhatt,komaram bheem,alluri sita ramaraju  ఆర్.ఆర్.ఆర్ గ్లిమ్ప్స్ వేరే లెవెల్
RRR first glimpse creates a sensation ఆర్.ఆర్.ఆర్ గ్లిమ్ప్స్ వేరే లెవెల్
Advertisement
Ads by CJ

రాజమౌళి - రామారావు - రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసారు మేకర్స్. 45 మినిట్స్ గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేసి ఆర్.ఆర్.ఆర్ సినిమాపై మరింత అంచనాలు పెంచేశారు. అల్లూరిగా రామ్ చరణ్, కొమరం భీం గా ఎన్టీఆర్, సీత గా అలియా భట్, అజయ్ దేవగన్ ఇలా కీలక పాత్రలతో కూడిన గ్లిమ్ప్స్ తో ఫాన్స్ కి స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చేసారు. 45 సెకన్ల నిడివి ఉన్న ఆర్.ఆర్.ఆర్ గ్లిమ్ప్స్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటివరకు వచ్చిన లుక్స్, హీరోల స్పెషల్ వీడియోస్ అన్ని ఒక ఎత్తు.. రామ్‌చరణ్ - తారక్‌ ఎన్టీఆర్ ఉన్న సన్నివేశాలతో వదిలిన ఈ గ్లిమ్ప్స్ ఒక ఎత్తు అనేలా ఉంది ఈ స్పెషల్ వీడియో. యుద్ధ సన్నివేశాలు ఒళ్ళు గగుర్పొడిచేలా.. అడవిలో తారక్ బైక్ పైన, రామ్ చరణ్ గుర్రం పై స్వారీ చెసే విజువల్స్, ఎన్టీఆర్ కొమరం భీమ్ క్లోజ్ అప్ లుక్, రామ్ చరణ్ అల్లూరి క్లోజ్ అప్ లుక్ అన్ని అద్భుతమే.

ఎన్టీఆర్ వాటర్ ఫైట్, రామ్ చరణ్ అగ్ని తో చేసి ఫైట్, అలియా భట్ సీత గా ఇచ్చిన ఎక్సప్రెషన్, ఓవిలియా కారు లో ఉన్న షాట్, అజయ్ దేవగన్ గన్ ఫైర్, లాస్ట్ లో పులి తో యాక్షన్ సీన్స్ అన్ని అదిరిపోయాయి. విజువల్ వండర్ గా కనిపిస్తున్న ఆర్.ఆర్.ఆర్ గ్లిమ్ప్స్ తోనే  ఫాన్స్ కి కిక్కిచ్చేసింది. ఎన్టీఆర్ యాక్షన్ ఎపిసోడ్, రామ్ చరణ్ యాక్షన్ సీన్స్ అన్ని సినిమాకే హైలెట్ అనడంలో ఎలాంటి సందేహమే లేదు అని ఈ గ్లిమ్ప్స్ తో ప్రూవ్ చేసారు రాజమౌళి.. జనవరి 7 న ఆర్.ఆర్.ఆర్ వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్నట్టుగా పక్క క్లారిటీ ఇచ్చారు.

RRR first glimpse creates a sensation:

RRR first glimpse: An explosive mind-blowing Roar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ