హైదరాబాద్ నగర శివారులోని పేకాట శిబిరంపై ఎస్వోటీ పోలీసులు దాడులు చేసారు. అయితే ఆ దాడుల్లో ఓ యంగ్ హీరో ఫామ్ హౌస్ పై కూడా దాడి చెయ్యగా.. అక్కడ ఓ 20 మంది నగరానికి చెందిన ప్రముఖులు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. అయితే ఆ ఫామ్ హౌస్ యంగ్ హీరో నాగ శౌర్య ది అని చెబుతున్నారు. నాగ శౌర్య ఐదేళ్ల పాటు లీజ్ కి తీసుకున్న ఫామ్ హౌస్ ని కొందరు ఓ పార్టీ కోసం అద్దెకి తీసుకుని.. అక్కడ బర్త్ డే పార్టీ అని చెప్పి.. పేకాట నిర్వహించడంతో.. ఉప్పందుకున్న పోలీస్ లు రైడ్ చెయ్యగా. నగరంలోని 20 మంది ప్రముఖులని అదుపులోకి తీసుకున్నారనే న్యూస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
నాగ శౌర్య కి సంబందించి మంచి రేవుల ఫామ్ హౌస్ లో పేకాట ఆడుతున్న వారిపై రైడ్ చేసి.. 6 లక్షల నగదు, ఓ 20 కార్లని పోలీస్ లు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అక్కడ ఫామ్ హౌస్ దగ్గర పేకాట నిర్వహిస్తున్న సుకుమారన్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారని.. ఆ ఫామ్ హౌస్ లో నాగ శౌర్య ఓన్ బ్యానర్ ఐరా క్రియేషన్స్ కి సంబందించి వస్తువులు ఉండడంతో అది నాగ శౌర్య ఫామ్ హౌస్ గా గుర్తించినట్లుగా చెబుతున్నారు. అయితే ఇక్కడ జరగుతున్న పేకాట కి నాగ శౌర్య కి సంబంధం ఉందా.. లేదా అనే కోణంలో పోలీస్ లు ఆరాతీస్తున్నారు.