టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్స్ ది డిఫ్రెంట్ స్టయిల్. పూరి జగన్నాధ్ హీరోలని మాస్ గా ప్రెజెంట్ చేస్తే.. త్రివిక్రమ్ క్లాస్ గా చూపిస్తారు. ఇక రాజమౌళి అటు ఇటుగా డిఫ్రెంట్ హీరోలని చూపిస్తారు. సుకుమార్ మాస్ గాను క్లాస్ గాను చూపిస్తారు. అయితే తాజాగా రాజమౌళి పూరి జగన్నాధ్ హీరోలను ఎంతగా షైన్ చేసాడో అనేది ఓ ఈవెంట్ లో ముచ్చటించాడు. పూరి జగన్నాధ్ వలనే ఆయా హీరోలలో దాగిన డిఫ్రెంట్ టాలెంట్ బయటికి వచ్చింది అంటూ రాజమౌళి చెప్పారు. ఇక ప్రభాస్ తో రాజమౌళి సినిమా ఎప్పుడు ఉంటుంది అనగానే.. నేను నా సినిమాల బిజీలో ఉన్నాను, ప్రభాస్ తన వరస కమిట్మెంట్స్ తో ఉన్నాడు.. సో ప్రభాస్ నాకు టైం ఎప్పుడిస్తాడో చూడాలి
ప్రభాస్ బాహుబలి కన్నా ముందే పూరి దర్శకత్వంలో బుజ్జిగాడు సినిమాతో నటనలో రాటు తేలాడు. ప్రభాస్ మాత్రమే కాదు.. మహేష్ ని పోకిరితో మాస్ గా హీరోగా నిలబడితే.. ఎన్టీఆర్ ని టెంపర్ తోనూ, రవితేజ ని ఇడియట్ తోనూ పవన్ కళ్యాణ్ ని బద్రి సినిమాతో ఆయా హీరోల ఇమేజ్ లని బయటికి తీశారు. సో పూరి జగన్నాధ్ డైరెక్షన్ లోనే హీరోలు స్టార్స్ అయ్యారు అంటూ రాజమౌళి సన్సేషనల్ గా మాట్లాడారు. ఇక ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ లో రాజమౌళి బిజీ కాబోతున్నారు. రేపు ఉదయం 11 గంటలకి ఆర్.ఆర్.ఆర్ నుండి 45 సెకెన్స్ గ్లిమ్ప్స్ రాబోతుంది.