బాలకృష్ణ ఫస్ట్ టైం బుల్లితెర మీద ఓ ఓటిటి కోసం టాక్ షో చెయ్యడం ఆయన ఫాన్స్ లో విపరీతమైన అంచనాలు కలిగేలా చేసింది. అది కూడా మెగా కాంపౌండ్ ఆహా ఓటిటి కోసం బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో. మరి టాక్ షో అంటే.. ఏ పర్సనల్ ప్రశ్నలో, ఏ కెరీర్ ముచ్చట్లు ఉంటాయనే అందరూ ఎక్సపెక్ట్ చేస్తారు.. కానీ బాలయ్య ఆహా అన్ స్టాపబుల్ టాక్ షో అంతకు మించి అన్నట్టుగా ఉంది. బాలకృష్ణ అన్ స్టాపబుల్ ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్ గా మంచు ఫ్యామిలీ అంటే మోహన్ బాబు అండ్ లక్ష్మి, విష్ణు లు వచ్చారు. మరి ఈ మధ్యనే మా ఎన్నికలు జరిగాయి. అందులో విజయం సాధించారు. అలా మెగా ఫ్యామిలీకి మంచు ఫ్యామిలీ కి దూరం ఏర్పడింది. అలాంటాప్పుడు ఆ షో పై అందరిలో క్రేజ్ ఉంటుంది కానీ బాలకృష్ణ అందుకు సంబందించిన ప్రశ్నలు ఆ షో లో అడుగుతారని ఎవరూ అనుకోరు.
కానీ అడిగారు. మోహన్ బాబు ని బాలకృష్ణ చిరంజీవి గారి మీద మీకు నిజంగా ఉన్న అభిప్రాయమేమిటి అంటూ మోహన్ బాబు - చిరు మధ్యన మనస్పర్ధలపై ప్రశ్న వేశారు. అది ఓకె.. కానీ ఈ షో లో పాలిటిక్స్ పై కూడా ప్రశ్నలు మొదలయ్యాయి. అది కూడా మోహన్ బాబు బాలయ్యని అన్నగారు ఎన్టీఆర్ తర్వాత టిడిపి పగ్గాలు నువ్ తీసుకోకుండా చంద్రబాబు కి ఎందుకు ఇచ్చావ్ అని, ఇక బాలయ్య కూడా మీరు అన్న పార్టీని వదిలి వేరే పార్టీలోకి ఎందుకు వెళ్లారో అంటూ ప్రశ్నలు వెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. మధ్యలో కిరికిరి లు పెడుతుంటాడు ఒకాయన.. అరవిందే నిన్ను ఇలాంటి ప్రశ్నలు అడగమన్నారు కదా అంటూ మోహన్ బాబు అడగడం చూస్తే.. ఈ ఆహా షో లో ఇలాంటి ప్రశ్నలు ఎక్సపెక్ట్ చెయ్యొచ్చు అని, అలా అన్ స్టాపబుల్ టాక్ షో పై అంచనాలు పెంచేశారు.