Advertisementt

బిగ్ బాస్ స్టేజ్ అంతా కళకళలాడిపోతుంది

Sun 31st Oct 2021 04:13 PM
bigg boss 5,bigg boss diwali special episode,bigg boss telugu,nagarjuna,vijay devarakonda,shriya saran,anand devarakonda,avika goer,anchor suma  బిగ్ బాస్ స్టేజ్ అంతా కళకళలాడిపోతుంది
Bigg Boss Diwali Special Episode బిగ్ బాస్ స్టేజ్ అంతా కళకళలాడిపోతుంది
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 ఎనిమిది వారలు పూర్తి చేసుకుంది. అంటే సగానికి పైగా బిగ్ బాస్ పూర్తయ్యింది. బిగ్ బాస్ హౌస్ లో ఓ అంన్నత క్రేజ్ ఉన్న కంటెస్టెంట్స్ లో శ్రీరామ్, సన్నీ, మానస్, రవి లు కనిపిస్తున్నారు తప్ప.. మిగతా వారు సో సో అన్నట్టుగానే ఉన్నారు. బయట విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న షణ్ముఖ్.. బిగ్ బాస్ హౌస్ లో నథింగ్ అన్నట్టుగా ఉన్నాడు. ఇక రోజు రోజుకి పడిపోతున్న బిగ్ బాస్ గ్రాఫ్ పెంచేందుకు యాజమాన్యం కష్టపడుతుంది. వారం వారం ఎలిమినేషన్ లీక్స్ అవి బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాయి. ఇక ఫెస్టివల్స్ స్పెషల్ అంటూ దసరా స్పెషల్ బిగ్ బాస్ ఎపిసోడ్ బాగా పేలింది. హీరోయిన్స్ డాన్స్ లు, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టీం ఇలా బిగ్ బాస్ స్టేజ్ పై సందడి కనిపించింది.

అది వర్కౌట్ అవడంతో.. స్టార్ మా ఈ రోజు దీపావళి స్పెషల్ ఎపిసోడ్ అంటూ హడావిడి చేస్తుంది. గురువారం దీపావళికి.. ఈరోజే దివాళి స్పెషల్ ఎపిసోడ్ డిజైన్ చేసేసింది. ఇక స్టేజ్ మీద నాగార్జున ఫెస్టివ్ లుక్ లో అదరగొట్టేస్తుంటే.. దేవరకొండ బ్రదర్స్ అల్లరి, మంచి రోజులు టీం సందడి, అవికా గోర్ స్పెషల్ డాన్స్, సింగర్ హడావిడి.. మధ్యలో యాంకర్ సుమ పంచ్ లు.. అబ్బో బిగ్ బాస్ స్టేజ్ ఈ రోజు కళకళలాడిపోయేలా కనిపిస్తుంది.. ప్రస్తుతం వదిలిన ప్రోమోస్ లో. విజయ్ దేవరకొండ పుష్పక విమానం పబ్లిసిటీ కోసం వస్తే.. స్పెషల్ గా శ్రియ బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చింది. ఇలా ఈ రోజు నాలుగు గంటల బిగ్ బాస్ ఎపిసోడ్ ఓ రేంజ్ లో ఉండబోతుంది అనేది ఆ ప్రోమోస్ చూస్తే తెలుస్తుంది. 

Bigg Boss Diwali Special Episode:

Bigg Boss 5 Diwali Special Episode Promo viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ