Advertisementt

రవితేజ జోరు..

Sun 31st Oct 2021 03:59 PM
ravi teja,sudheer varma,abhishek nama,ravi teja rt70 announced  రవితేజ జోరు..
Ravi Teja RT70 Announced రవితేజ జోరు..
Advertisement
Ads by CJ

మాస్ మహారాజ రవి తేజ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఖిలాడీ మూవీ సాంగ్స్ షూట్ ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతుంది. సాంగ్స్ చిత్రీకరణ ఫినిష్ అయితే.. ఖిలాడీ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక రామ రావు ఆన్ డ్యూటీ సినిమా షూటింగ్ కూడా చివరి దసరాకు చేరుకుంది. ఈమధ్యనే రవితేజ త్రినాధ్ రావు నక్కినతో ఢమాకా మొదలు పెట్టి.. దసరా స్పెషల్ గా ఢమాకా  ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేసాడు. ఇప్పుడు  తాజాగా రవితేజ 70వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను ఇచ్చారు మేకర్స్. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీం వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అభిషేక్ నామా నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

RT70వ సినిమాకు సంబంధించిన ప్రకటన చేస్తూ విడుదల చేసిన పోస్టర్ లో హీరోలు నిలిచి ఉండరు అని కొటేషన్ రాసి ఉంది. ఇక వెనకాల చెక్కినట్టుగా రకరకాల శిల్పాలు కనిపిస్తున్నాయి. అలా మొత్తానికి సినిమాలో ఏదో కొత్త కథ, కాన్సెప్ట్ ఉన్నట్టు అందరికీ ఆసక్తిని కలిగిస్తుంది. నవంబర్ 5న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయబోతోన్నట్టు ప్రకటించారు.

రచయితగా శ్రీకాంత్ విస్సా ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. ఆయనే ఈ సినిమాకు కథను అందించారు. సుధీర్ వర్మ తన సినిమాలను ఎంత కొత్తగా, స్టైలీష్‌గా తెరకెక్కిస్తారో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో రవితేజను ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా చూపించబోతోన్నారు.

కొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్న రవితేజ 70వ ప్రాజెక్ట్‌ యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో ఉండబోతోంది. ఇక ఈ చిత్రానికి ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేయబోతోన్నారు.

Ravi Teja RT70 Announced:

Ravi Teja, Sudheer Varma, Abhishek Nama RT70 Announced

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ