నందమూరి బాలకృష్ణ అంటే.. నందమూరి ఫాన్స్ కే కాదు.. ఆయన సినిమాల్లో చెప్పే మాస్ డైలాగ్స్ కి మాస్ ప్రేక్షకులు ఫిదా అవుతారు. జై బాలయ్య జై జై బాలయ్య అంటూ రెచ్చిపోతారు. అలాంటి బాలయ్య ఓ టాక్ షో కి హోస్ట్ గా చేస్తే.. ఆ షో పై ఎంతగా అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అల్లు అరవింద్ గారి ఆహా ఓటిటి కోసం నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ అనే టాక్ షో కి హోస్ట్ గా చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన అన్ స్టాపబుల్ మేకింగ్ వీడియో, మేకింగ్ స్టిల్స్, ప్రోమో అన్ని అద్భుతంగా ఉండడంతో ఆ షో పై అందరిలో క్యూరియాసిటీ మొదలైపోయింది. బాలకృష్ణ ఆహా టాక్ షో లో మొదటగా మంచు ఫ్యామిలీని చేసిన ఇంటర్వ్యూ ప్రోమో ని తాజాగా ఆహా వాళ్ళు వదిలారు,.
మరి ఈ ప్రోమోలో బాలయ్య సింహం తో వేట నాతొ ఆట అన్నట్టుగా అదరగొట్టే స్టయిల్ తో.. అదిరిపోయే లుక్ తో.. ఎంట్రీ తోనే భీభత్సమైన కిక్ ఇచ్చేసారు. ఇక టాక్ షో కి వచ్చిన ఆడియన్స్ జై బాలయ్య, జై జై బాలయ్య అంటూ అరుస్తుండగా.. బాలయ్య షో కి ఎంట్రీ ఇచ్చారు..
నేను మీకు తెలుసు.. నా స్థానం మీ మనసు అంటూ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన బాలయ్య మోహన్ బాబు కి స్వాగతం పలికారు, ఎవరి జీవితం కళా ప్రపూర్ణమో.. ప్రజా సేవ సంపూర్ణమో.. ఆయనే అనగానే మోహన్ బాబు ఎంట్రీ ఇచ్చారు. దానితో బాలయ్య షాకవుతూ చాదస్తం.. ఇంట్రడక్షన్ కాకుండానే వచ్చేస్తారు.. అంటూ కామెడీ చేసారు. ఏంటి మీరు ఇంకా కుర్రాడిలా ఉన్నారు అనగానే మోహన్ బాబు.. ఎవరికి అయ్యింది వయసు నీకు అయ్యింది.. అని అనగానే బాలయ్య 16 అంటూ మోహన్ బాబు ని నవ్వించేసారు. ఇక మీరు చేసిన సినిమాల్లో మీరు అస్సలు చూసుకోలేని సినిమా ఏది అని బాలయ్య అనగానే మోహన్ బాబు పాతాళం పాండు అని అన్నారు. దానికి బాలయ్య అది అంత రాడ్ రంబోలా అని అన్నారు.
ఇక బాలయ్య మోహన్ బాబు ని అడగాల్సిన ప్రశ్న అడిగేసారు. అది మీకు చిరంజీవి గారి మీద నిజంగా ఉన్న అభిప్రాయమేమిటి అని.. దానికి మోహన్ బాబు ఆయన అన్ని చూస్తుంటారు అంటూ దేవుడికి చెయ్య చూపించారు. బాలయ్య పర్సనల్ ప్రశ్న అంటూ.. సాయంత్రం 7.30 తర్వాత ఏక్ పెగ్గుల అంటూ నవ్వించేసారు. ఇంకా మోహన్ బాబు గారి కెరీర్ మొదలు పెట్టిన విషయాలు చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
అంతేకాదు.. మోహన్ బాబు కూడా బాలయ్యని ఓ ప్రశ్న వేశారు. ఎన్టీఆర్ అన్నగారు తర్వాత టిడిపి పగ్గాలు నువ్వు తీసుకోకుండా చంద్రబాబు కి ఎందుకిచ్చావ్ అని, దానికి బాలయ్య ఆ ఒక్కటి అంటూ కాస్త కోపమయ్యారు. ఇంకా బాలయ్య మరి అన్నగారి పార్టీ వదిలేసి.. వేరే పార్టీలో జాయిన్ అయ్యారంటూ మోహన్ బాబు ని ఇరికించారు. ఈ షో కి వచ్చా.. ఫిట్టింగ్ మాస్టర్ అరవిందే అడగమని ఇవన్నీ నీకు చెప్పాడా అని మోహన్ బాబు అనగా ఈ షో సాక్షిగా నేను మిమ్మల్ని బాధపెట్టానా అంటూ బాలయ్య మోహన్ బాబు ని సూటిగానే ప్రశ్నించారు.. ఇంకా ఈ ప్రోమోలో లక్ష్మి మంచు, మంచు విష్ణు లు సందడి చేసారు.