Advertisementt

పునీత్ మరణం హార్ట్ ఎటాక్ తో కాదు..

Sat 30th Oct 2021 11:21 PM
puneeth rajkumar,puneeth family doctor,puneth passed away,fatal cardiac arrest,puneeth rajkumar death  పునీత్ మరణం హార్ట్ ఎటాక్ తో కాదు..
Puneeth Rajkumar Family Doctor comments on Puneeth Death పునీత్ మరణం హార్ట్ ఎటాక్ తో కాదు..
Advertisement

కన్నడ టాప్ హీరో పునీత్ రాజ్ కుమార్ జిమ్ లో వ్యయం చేస్తూ అస్వస్థతకు గురై.. ఆసుపత్రికి చేరుకునే లోపే ప్రాణాలు వదలడంతో.. ఆయనకి హార్ట్ ఎటాక్ రావడంతో పునీత్ మరణించాడని అన్నారు. బెంగుళూరు డాక్టర్స్ కూడా వాళ్ళ వద్దకు వెళ్ళేసరికే పునీత్ రాజ్ కుమార్ చనిపోవడంతో ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చింది అని అన్నారు. అయితే తాజాగా పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీ డాక్టర్ పునీత్ మరణం పై స్పందిస్తూ.. పునీత్ నిన్న ఉదయం తన భార్య తో మా హాస్పిటల్ కి వచ్చారని, కాస్త నలతగా ఉంది డాక్టర్ ఏమిటో చూడండి అనగానే.. ఆ మాట పునీత్ నోట విన్న నేను ఆశ్చర్య పోయాను. ఎందుకంటే పునీత్ హెల్త్ పట్ల చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడు. అందరికి నేను చెబుతుంటాను.. పునీత్ ని చూసి నేర్చుకోండి అని.

అయితే భార్య అశ్విని తో వచ్చిన పునీత్ కి వెంటనే పలు పరీక్షలు చేశాననీ, ఆ సమయంలో పునీత్ బీపీ అన్ని నార్మల్ గానే ఉన్నాయని, ఇక గుండె స్థిరంగా కొట్టుకుందనీ, ఊపిరితిత్తుల్లోనూ ఎలాంటి సమస్యా లేదనీ అన్నారు. కాకపోతే తన దగ్గరికి వచ్చేటప్పటికీ.. పునీత్ ఒంటి నిండా చెమటలు పట్టి ఉన్నాయని, వ్యాయామం చేసేవారికి చమట అనేది సహజం అని, అయితే తాను ఈసీజీ చేసి చూస్తే అందులో ఓ స్ట్రెయిన్‌ కనిపించిందని అందుకే.. విక్రమ్‌ ఆసుపత్రికి వెంటనే తీసుకెళ్లాలని అశ్వినికి చెప్పాను అని, వారు అలా కారు ఎక్కగానే.. నేను విక్రమ్‌ ఆసుపత్రికి కాల్‌ చేసి ఐసీయూ సిద్ధం చేయాలని చెప్పాను. 

అయితే అశ్విని, పునీత్ లు ఐదారు నిమిషాల్లో విక్రమ్ ఆసుపత్రికి చేరుకున్నప్పటికీ పునీత్ ని బతికించుకోలేకపోయామని పునీత్ ఫ్యామిలీ డాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పునీత్ ది గుండెపోటు కాదు అని, కార్డియాక్ అరెస్ట్ అని ఆయన అన్నారు. అకస్మాత్తుగా హార్ట్ కి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడంతోనే పునీత్ మరణం సంభవించింది అని పునీత్ ఫ్యామిలీ డాక్టర్ చెప్పడంతో ఆయన ఫాన్స్ మరింతగా బాధపడుతున్నారు. 

Puneeth Rajkumar Family Doctor comments on Puneeth Death:

Puneeth Rajkumar passed away due to a fatal cardiac arrest

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement