బిగ్ బాస్ సీజన్ 5 ఎనిమిది వారాలు పూర్తి చేసుకుని తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టింది. గత శనివారం నాగార్జున బిగ్ బాస్ ఎపిసోడ్ ని రక్తి కట్టించారు. లోబో, ప్రియా ఎలిమినేషన్ విషయంలో నాగ్ చేసిన డ్రామా బాగా పండింది. ఇక రెండు మూడు వారాల నుండి బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ లు ఇంట్రెస్టింగ్ గా అనిపించినా.. ఈవారం షణ్ముఖ్ ఈజీగా కెప్టెన్ అయిన ఫీలింగ్ వస్తుంది బుల్లితెర ప్రేక్షకులకి. ఇక ఇప్పటివరకు హౌస్ నుండి వరసగా లేడీస్ మాత్రమే ఎలిమినేట్ అవుతున్నారు తప్ప.. అబ్బాయిల్లో ఒక్క నటరాజ్ మాస్టర్ మాత్రమే ఇప్పటివరకు ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఈ వారం నామినేషన్స్ లో యాంకర్ రవి, శ్రీరామచంద్ర, సిరి, షణ్ముఖ్, లోబో, మానస్ లు ఉన్నారు.
అయితే అందులో ఎక్కువగా వీక్ గా ఉంది. లోబోనే. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్న ఈ వారం నామినేషన్స్ లో కాస్త లో ప్రొఫైల్ ఉంది లోబో కి. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయినప్పుడు కాస్త ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకున్న లోబో.. తర్వాత చెత్త వేషాలతో అతని గ్రాఫ్ డ్రాప్ అయ్యింది. ఇక ఈ వారం షణ్ముఖ్ ఓటింగ్ లో నెంబర్ వన్ లో ఉండగా.. లోబో లీస్ట్ లో ఉండడంతో.. ఈ వారం లోబో నే హౌస్ నుండి బయటికి వెళ్లిపోయాడు. మొదటి నుండి ప్రచారం జరిగినట్టుగానే ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేట్ అవ్వాల్సిన వారిలో లోబో హౌస్ ని వీడాడు. గత వారం సీక్రెట్ రూమ్ లోకి వెళ్లిన లోబో ఈ వారం నిజంగానే బయటికి వెళ్ళిపోయాడు.