కెప్టెన్ అవ్వాలి, కెప్టెన్ అవ్వాలనే కోరికను గత వారం తీర్చుకున్న సన్నీ.. ఈ వారం అంతా బాగానే ఆడినా.. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో సంచాలక్ జెస్సి తప్పుడు నిర్ణయాలతో.. చివరికి వరెస్ట్ పెరఫార్మెర్ గా మిగిలిపోయాడు. ఇక ఆడడమే చేతకాని షణ్ముఖ్.. అని మాస్టర్ కెప్టెన్సీ టాస్క్ నుండి అర్ధాంతరంగా తప్పుకోవడంతో కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్ అయ్యాక కూడా షన్ను యాటిట్యూడ్ మారలేదు. సిరి, షన్ను, జెస్సి ల ముచ్చట్లు ఇదే హౌస్ లో ఉంది. ఇక సన్నీ మాత్రం కెప్టెన్సీ టాస్క్ లో తనని ఆడనివ్వని జెస్సి పై చాలా కోపం పెట్టుకున్నాడు. అలాగే అవకాశం వచ్చినప్పుడు జెస్సిని రెచ్చగొట్టాడు.
ఇక ఈ వారం వరెస్ట్ పెరఫార్మెర్ ఎవరో చెప్పమనేసరికి.. కొంతమంది కాజల్ అంటే.. కొంతమంది సన్నీ అన్నారు. సన్నీ మాత్రం జెస్సి సంచాలక్ గా విఫలమయ్యాడు అంటూ అతన్ని వరెస్ట్ పెరఫార్మెర్ అన్నాడు. జెస్సికి - సన్నీ కి మధ్యన మాటల యుద్ధం జరిగింది. కాజల్ - సన్నీ కి మధ్యన వరెస్ట్ పెరఫార్మర్ విషయంలో సమానమైన ఓట్స్ వచ్చాయి. దానితో షణ్ముఖ్ సన్నీనే ఫైనల్ గా జైలు కి పంపాలన్నప్పుడు షణ్ముఖ్ పై సన్నీ, మానస్ లు విరుచుకుపడ్డారు. ఏది ఏమైనా షణ్ముఖ్ కెప్టెన్ అవ్వడం హౌస్ లో ఎవరికీ ఇష్టం లేదు.. ఇక కెప్టెన్ నుండి సన్నీ చివరికి వరెస్ట్ పెరఫార్మెర్ గా జైలుకి వెళ్ళాడు.