నిన్న ఉదయం కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం సినిమా ఇండస్ట్రీ ప్రముఖులని, సినీ ప్రియులని, ఆయన అభిమానులని దిగ్భ్రాంతికి గురి చేసింది. పునీత్ రాజ్ కుమార్ జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో.. ఆయనని కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించగా.. అక్కడ పరిస్థితి విషంగా మారడంతో హుటాహుటిన బెంగుళూర్ లోని విక్రమ్ ఆసుపత్రికి తరలించేసరికి.. పునీత్ రాజ్ కుమార్ చనిపోయారు. అయితే ఆయన చనిపోయిన విషయం 2 నుండి 2.30 మధ్యన కర్ణాటక సీఎం ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా ప్రకటించారు. అప్పటికే కన్నడ సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానులు విక్రమ్ ఆసుపత్రికి పెద్ద ఎత్తున చేరుకున్నారు.
ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పునీత్ కి అవినాభావ సంబంధం ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పునీత్ దోస్త్. ఎన్టీఆర్ సినిమాలను రీమేక్ చేసి హిట్ కొట్టిన పునీత్ సినిమా కోసం ఎన్టీఆర్ ఓ పాట పాడాడు. తన స్నేహితుడిని కోల్పోయినందుకు బాధగా ఉంది అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేసాడు. ఇక బాలయ్య, చిరు, మహేష్, విజయ్ దేవరకొండ, పవన్ కళ్యాణ్, మంచు ఫ్యామిలీ మెంబెర్స్ ఇలా సినీ ప్రముఖులంతా పునీత్ మరణాన్ని జీరించుకోలేకపోతున్నారు.
ఇక ఈ రోజు పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు జరగనున్నాయి. తండ్రి సమాధి వద్దే పునీత్ అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు కుటుంబ సభ్యులు. అయితే పునీత్ రాజ్ కుమార్ చివరి చూపు కోసం ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు బెంగళూరుకు జూనియర్ ఎన్టీఆర్ తో పాటు మరికొంతమంది సినీ ప్రముఖులు వెళ్ళబోతున్నారు. సాయంత్రం మెగాస్టార్ చిరు కూడా పునీత్ ఆఖరి చూపు కోసం బెంగుళూరుకి వెళ్ళబోతున్నారు. చివరిసారి పునీత్ ని చూసేందుకు ఆయన అభిమానులు, కన్నడ ఇండస్ట్రీ నిన్నటి నుండి అయన ఇంటి దగ్గరే ఉన్నారు.