రాజమౌళి దర్శకత్వంలో.. రామ్ చరణ్ - ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఆర్.ఆర్.ఆర్ నుండి ఈ రోజు మాసివ్ అప్ డేట్ రాబోతుంది అని రెండు రోజుల క్రితమే.. ఆర్.ఆర్.ఆర్ మేకర్స్ అప్ డేట్ ఇచ్చినప్పటినుండి ఎన్టీఆర్, అండ్ రామ్ చరణ్ ఫాన్స్ తో పాటుగా.. ఆర్.ఆర్.ఆర్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు ఎంతో ఎగ్జైట్ అయ్యారు. ఈ రోజు ఆర్.ఆర్.ఆర్ సినిమా రిలీజ్ అయ్యేవరకు పీవీఆర్ థియేటర్స్ పీవీఆర్.ఆర్.ఆర్ గా మారబోతుంది అని.. కొద్దీ నెలలపాటు పివిఆర్ థియేటర్స్ అన్ని పివిఆర్.ఆర్.ఆర్ గా ఉండబోతున్నట్టుగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు.
తర్వాత ఆర్.ఆర్.ఆర్ నుండి మాసివ్ అప్ డేట్ రాబోతుంది అనుకునేలోపు.. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో అకాల మరణ వార్త విన్న ఆర్.ఆర్.ఆర్ మేకర్స్.. ఆర్.ఆర్.ఆర్ అప్ డేట్ ని పోస్ట్ పోన్ చేసారు. కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ అకాలమరణంతో.. అప్ డేట్ పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా. ప్రకటించడంతో ఆర్.ఆర్.ఆర్ ఫాన్స్ డిస్పాయింట్ అవుతున్నారు. ఎన్నో రోజుల నుండి ఆర్.ఆర్.ఆర్ నుండి రాబోయే అప్ డేట్ ట్రేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఇలా జరిగే సరికి కాస్త ఫీలవుతున్నారు.