బిగ్ బాస్ హౌస్ లో ఈ సోమవారం నామినేషన్స్ విషయంలో కంటెస్టెంట్స్ మధ్యన ఎలాంటి గొడవ జరగలేదు. ఎవరు మనసులు నొచ్చుకునేలా మరో కంటెస్టెంట్ నడుచుకోలేదు. కాకపోతే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎమోషన్స్ తో ఆడుకున్నారు. బిగ్ బాస్ సభ్యుల ఇంటి నుండి వచ్చిన లెటర్ తీసుకున్నవారు నామినేషన్స్ లోకి రాకుండా ఉంటే.. తీసుకొని వారు ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చారు. ఒకపక్క నామినేట్ అయిన బాధ, మరోపక్క ఫామిలీస్ పంపిన లెటర్ చదవలేకపోయామనే బాధ. ఫైనల్ గా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు.
ఈ వారం నామినేట్ అయిన వారిలో షణ్ముఖ్ జాస్వంత్ ఎప్పటిలాగే ఓటింగ్ విషయంలో నెంబర్ వన్ స్థానంలో ఉంటే.. శ్రీరామ చంద్ర ఓటింగ్ పరంగా సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఆ తర్వాత మానస్ సేఫ్ గా మూడో ప్లేస్ లో ఉన్నాడు. అలాగే యాంకర్ రవి, సిరికూడా అటు ఇటుగా ఒకే రకమయిన ఓటింగ్ తో ఈక్వల్ పొజిషన్ లో ఉన్నారు. కానీ లోబో మాత్రం ఈవారం డేంజర్ జోన్ లో ఉన్నాడు. ఫైనల్ గా ఓటింగ్ లో వెనకబడిన లోబో ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది అని, మిగతా నలుగురు సేవ్ అవుతారని అంటున్నారు. అయితే ఇక్కడ ఓటింగ్ కన్నా మిస్సెడ్ క్లాస్ డేటానే కీలకం అని చెబుతున్నారు.