Advertisementt

పునీత్ మరణం: సంతాపం తెలిపిన ప్రముఖులు

Fri 29th Oct 2021 08:35 PM
chiranjeevi,balakrishna,mahesh,ap cm jagan,tdp president chandrababu,nara lokesh,  పునీత్ మరణం: సంతాపం తెలిపిన ప్రముఖులు
Celebrities pour in their condolences for Puneeth Rajkumar పునీత్ మరణం: సంతాపం తెలిపిన ప్రముఖులు
Advertisement
Ads by CJ

కన్నడ సినీనటుడు పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీ.. కన్నడ, తమిళ ఇండస్ట్రీనే కాదు.. అన్ని భాషల సినిమా ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు. టాలీవుడ్ నుండి బాలకృష్ణ, మహేష్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, తెలుగు రాష్ట్రాల సీఎం లు ఇంకా చాలామంది సినీప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

బాలకృష్ణ:

అప్పు(పునీత్ రాజ్ కుమార్) మృతితో గొప్ప స్నేహితుడిని కోల్పోయాను. ఆయన మృతి కన్నడ చలనచిత్ర పరిశ్రమకు తీరని నష్టం. బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేసి ప్రముఖ హీరోగా, గాయకుడిగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా, నిర్మాతగా అనితర ప్రతిభ ప్రదర్శించాడు. తండ్రికి తగ్గ తనయుడిగా  పేరొందాడు. రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

ఏపీ సీఎం జగన్‌: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పునీత్ మృతి పట్ల దిగ్బ్రాంతికి గురయ్యామని.. పునీత్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

టిడిపి అధ్యక్షుడు: చంద్రబాబు 

కన్నడ సినీ హీరో పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అన్నారు. కన్నడ సినీ పరిశ్రమలో తన  విలక్షణమైన నటనతో లక్షలాదిమంది అభిమానులను పునీత్ సంపాదించుకున్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న పునీత్ రాజ్ కుమార్ చిన్నవయసులోనే గుండెపోటుకు గురై మృతి చెందడం బాధాకరం. పునీత్ మృతిని తట్టుకునే శక్తిని ఆయన కుటుంబసభ్యులకు భగవంతుడు ఇవ్వాలి. పునీత్ రాజ్ కుమార్ ఆత్మకు శాంతిచేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. 

మెగాస్టార్ చిరంజీవి:

పునీత్ రాజ్ కుమార్ మరణం అత్యంత బాధాకరమని, తీవ్ర వేదనతో హృదయం ముక్కలైందని చిరంజీవి పేర్కొన్నారు. పునీత్ రాజ్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని, అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని వెల్లడించారు. కన్నడ చిత్ర పరిశ్రమే కాకుండా, యావత్ భారత చిత్ర రంగానికి పునీత్ మరణం పెద్ద లోటు అని పేర్కొన్నారు. పునీత్ కుటుంబానికి, బంధుమిత్రులకు, అభిమానులకు ధైర్యం చేకూరాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. 

పవన్ కళ్యాణ్: 

పునీత్ మరణ వార్త తెలిసి హృదయం ముక్కలయింది అని.. అయన ఆత్మకి శాంతి చేకూరాలంటూ పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ విడుదల చేసారు. పునీత్ కుటుంబ సభ్యులకి ఆ దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన కోరుకున్నారు.  

మహేశ్ బాబు:

మహేశ్ బాబు స్పందిస్తూ పునీత్ రాజ్ కుమార్ ఇక లేరన్న విషాదవార్త చూసి షాక్ కు గురయ్యానని, తీవ్ర విచారం కలుగుతోందని పేర్కొన్నారు. తాను ఇప్పటివరకు కలిసి, మాట్లాడిన వారిలో అత్యంత వినమ్రుడైన వ్యక్తి పునీత్ రాజ్ కుమార్ అని వివరించారు. పునీత్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు హార్దిక సంతాపం తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు. 

మా అధ్యక్షుడు మంచు విష్ణు:

ఈ వార్తను తాను నమ్మలేకపోతున్నానని, తన సోదర సమానుడు పునీత్ రాజ్ కుమార్ మరణించాడన్న వార్తను తాను అంగీకరించనని పేర్కొన్నారు.

Celebrities pour in their condolences for Puneeth Rajkumar:

Chiru, Blayya, Ap Cm and others condolences for Puneeth Rajkumar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ