కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఈ రోజు ఉదయం జిమ్ చేస్తున్న సమయంలో గుండెపోటుకి గురవడంతో.. ఆయన్ని కుటుంబ సభ్యులు బెంగుళూరు లోని విక్రమ్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే పునీత్ రాజ్ కుమార్ పరిస్థితి విషమించడంతో.. ఐసియులో ఉంచి అత్యవసర చికిత్స అందిస్తుండగా.. ఆయన ప్రాణాలు కోల్పోయారని తాజాగా అఫీషియల్ ప్రకటన వెలువడింది. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించడమే కాకుండా.. అభిమానుల తాకిడి తట్టుకునేందుకు గాను ఆస్పత్రితో పాటు ప్రధాన మార్గాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చెయ్యడం అన్ని ఆఘమేఘాల మీద జరిగిపోయాయి. అప్పటికే పునీత్ అభిమానులు వేల సంఖ్యలో విక్రమ్ ఆసుపత్రికి చేరుకొని హడావిడి చేసారు.
ఇక పునీత్ రాజ్ కుమార్ పరిస్థితి విషమం అని తెలిసిన వెంటనే విక్రమ్ ఆసుపత్రికి చేరుకుంటున్న శాండిల్‌వుడ్ సినీ ప్రముఖులు చేరుకున్నారు. అలాగే కర్ణాటక వ్యాప్తంగా సినిమా థియేటర్లు మూసివేయాలని కర్ణాటక సర్కార్ ఆదేశించింది. పునీత్ రాజ్ కుమార్ 11 .30 నిమిషాలకు చనిపోయినట్టుగా బెంగుళూర్ విక్రమ్ ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. పునీత్ రాజ్ కుమార్ వయసు 46. చిన్న వయసులో ఆయన మరణించడంతో శాండిల్‌వుడ్ అంతా తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.