Advertisementt

కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ కి హర్ట్ ఎటాక్

Fri 29th Oct 2021 01:31 PM
kannada hero,puneeth rajkumar,puneeth admitted in hospital,heart attack,bangalore vikram hospital  కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ కి హర్ట్ ఎటాక్
Hero Puneeth Rajkumar admitted in Hospital కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ కి హర్ట్ ఎటాక్
Advertisement
Ads by CJ

కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ ఈ రోజు ఉదయం జిమ్ చేస్తుండగా.. తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆయన్ని కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా ఆరోగ్యం బాగాలేని పునీత్ ఈ రోజు జిమ్ చేస్తున్న టైం లో గుండెపోటు రావడంతో ఆయనకి బెంగుళూరు విక్రమ్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారని.. పునీత్ రాజ్ కుమార్ పరిస్థితి విషమంగా ఉంది అని తెలియడంతో ఆయన ఫాన్స్ పెద్ద ఎత్తున బెంగుళూరు లోని విక్రమ్ హాస్పిటల్ కి చేరుకుంటున్నారు. పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్యం విషమం అని తెలియడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. 

పునీత్ రాజ్ కుమార్ కి గుండెపోటు వచ్చింది అని తెలిసిన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై హుటాహుటిన విక్రమ్ ఆస్పత్రికి చేరుకుని రాజ్ కుమార్ ఆరోగ్య పరిస్థితిని విక్రమ్ హాస్పిటల్ డాక్టర్స్ ని అడిగి తెలుసుకుని పునీత్‌ కుటుంబ సబ్యులని పరామర్శించారు. ఇక పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది అని.. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని.. ఆయన ఫాన్స్ తీవ్ర ఆందోళనకి గురవుతున్నారు. ప్రస్తుతం ఆయన ఐసియు లో చికిత్స పొందుతున్నారని, ఈరోజు 3 గంటలకు ఆయన హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. 

Hero Puneeth Rajkumar admitted in Hospital:

Kannada Hero Puneeth Rajkumar admitted in Hospital due to heart ettack

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ