సూపర్ స్టార్ రజినీకాంత్ హాస్పిటల్ కి వెళుతున్నారనగానే ఆయన అభిమానుల్లో కలవరం మొదలవుతుంది. సాధారణ హెల్త్ చెకప్ కి వెళ్లినా అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతారు. ఇక మూడు రోజుల క్రితం ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకుని.. భార్య లత తో కలిసి ప్రధాని మోడీ, రాష్ట్రపతి కోవిద్ ని కలిసి వచ్చిన రజినీకాంత్ గత రాత్రి ఉన్నట్టుండి చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరడంతో ఆయన అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అవార్డు అందుకుంటూ ఎంతో హుషారుగా కనిపించిన రజిని ఇలా హాస్పిటల్ కి వెల్లడమేమిటో అని అభిమానుల్లో రకరకాల అనుమానాలు స్టార్ట్ అయ్యాయి.
అయితే రజినీకాంత్ భార్య లత మాత్రం రజినీకాంత్ సాధారణ హెల్త్ చెకప్ కోసమే ఆసుపత్రి లో జాయిన్ అయ్యారని, ప్రస్తుతం రజిని ఆరోగ్యంగా ఉన్నారు. రొటీన్ హెల్త్ చెకప్ లో భాగంగానే ఏడాదికి ఒకసారి ఆయనకు ఇలాంటి పరీక్షలు చేయడం సహజమే.. ఆయన ఆరోగ్యంపై ఎవరూ ఎలాంటి ఆందోళన పడవద్దని చెప్పారు. అయితే శుక్రవారం డిశ్చార్జ్ అవుతారని అనుకున్న రజిని.. ఈ రోజు అంటే శుక్రవారం మొత్తం డాక్టర్స్ అబ్జర్వేషన్ లోనే ఉండాలని.. ఈ రోజు టెస్ట్ లు అన్ని చేసి రజిని ని రేపు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక గత జూన్ నెలలో కరోనా సెకండ్ వేవ్ టైం లో రజిని ప్రత్యేక విమానంలో అమెరికా వెళ్లి అక్కడ రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకుని వచ్చిన విషయం తెలిసిందే.