షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ అక్టోబర్ 3 న ముంబై లోని క్రూయిజ్ షిప్ లో జరిగిన రేవ్ పార్టీ లో ఎన్సీబీ అధికారులకి పట్టుబడి.. జైలు పాలయ్యాడు. ఆర్యన్ ఖాన్ ఫ్రెండ్ దగ్గర డ్రగ్స్ దొరకడంతో.. ఆర్యాన్ ఖాన్ తో పాటుగా అప్పుడు 14 మందిని అరెస్ట్ చేసి జైలు కి తరలించారు ఎన్సీబీ అధికారులు. ఆ తర్వాత ఈ కేసులో మొత్తంగా 20 మందిని అరెస్ట్ చేసారు. అప్పటి నుండి ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై షారుఖ్ ఖాన్ లాయర్లు కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. అటు ఎన్సీబీ అధికారుల తరుపు లాయర్ కూడా కాస్త గట్టిగానే వాదించడంతో.. ఆర్యన్ ఖాన్ కి పదే పదే బెయిల్ రిజెక్ట్ అవుతూ వచ్చింది.
ఇక లాభం లేదననుకున్న షారుఖ్ ఖాన్.. ఇండియా నెంబర్ వన్ లాయర్ తో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ ని హై కోర్టులో వేయించడం.. హై కోర్టులో ఆర్యన్ తరఫు లాయర్ మాట్లాడుతూ.. ఆర్యన్ సెలబ్రిటీ కావడం వల్లే ఈ కేసు ఇంత పెద్దగా అయిందని, అయినా ఆర్యన్ ఖాన్ ఫోన్ లోని చాట్ అతను అమెరికా లో ఉన్నప్పుడు జరిగింది అని, అది ఇప్పటిది కాదని, కావాలనే ఆర్యన్ ఖాన్ ని ఈ కేసులో ఇరికించారని, అతని వద్ద ఎలాంటి డ్రగ్స్ లేవని, ఆర్యన్ దగ్గర, అతడి స్నేహితుడి వద్ద చాలా తక్కువ మోతాదులో డ్రగ్స్ దొరకడం వలన బెయిల్ ఇవ్వాలని షారుఖ్ లాయర్ కోర్టులో వాదించారు. వాదనలు, ప్రతి వాదనలు విన్న బాంబే హై కోర్టు ఆర్యన్ ఖాన్ కి బెయిల్ మంజూరు చెయ్యడంతో షారుఖ్ దంపతులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక నేడు ప్రొసీజర్ పూర్తి చేసుకుని, ఆర్యన్ ఖాన్ రేపు జైలు నుండి విడుదల కాబోతున్నాడు.