Advertisementt

నో జిమ్ ఓన్లీ డాన్స్

Thu 28th Oct 2021 06:27 PM
sai pallavi,malayala beauty,sai pallavi photos,sai pallavi dance,sai pallavi gym  నో జిమ్ ఓన్లీ డాన్స్
No Gym, Only Dance నో జిమ్ ఓన్లీ డాన్స్
Advertisement
Ads by CJ

హీరోలైన, హీరోయిన్స్ అయినా.. స్లిమ్ గా, ఫిట్ గా, గ్లామర్ గా ఉండాలి అంటే.. అధిక శాతం జిమ్ లోనే వర్కౌట్స్ తో గడపాలి.. ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ రష్మిక, పూజ హెగ్డే, సమంత, కాజల్, రకుల్ ప్రీత్ లాంటి హీరోయిన్స్ జిమ్ ల వెంట పడి వర్కౌట్స్, యోగా అంటూ స్లిమ్ గా మారిపోయి.. గ్లామర్ ని మెయింటింగ్ చేస్తుంటారు. కానీ ఇప్పుడొక హీరోయిన్ నో జిమ్.. ఓన్లీ డాన్స్ అంటుంది. ఆమె ఎవరో కాదు నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. లవ్ స్టోరీ తో భారీ హిట్ కొట్టిన సాయి పల్లవి జిమ్ కి వెళ్ళేదే లేదు అంటుంది. హీరోయిన్ అవ్వకముందే డాన్సర్ గా సాయి పల్లవి ఫుల్ ఫెమస్. తెలుగులోనే ఢీ డాన్స్ షో ద్వారా సాయి పల్లవి పాపులర్ అయ్యింది. ఆ తర్వాత సాయి పల్లవి పెరఫార్మెన్స్ ఎంతగా హైలెట్ అయ్యిందో.. అంతే ఇదిగా డాన్స్ తోనూ మెస్మరైజ్ చేసింది.

ఫిదా లో సాంగ్స్ కానివ్వండి.. నిన్నగాక మొన్నొచ్చిన లవ్ స్టోరీ సారంగ దారియా సాంగ్ కూడా అంతే పాపులర్ అయ్యింది. అయితే సాయి పల్లవి జిమ్ లో వర్కౌట్స్ చేసే కన్నా.. డాన్స్ చేస్తే స్లిమ్ గా మారిపోవచ్చు అంటుంది. డాన్స్ కూడా బాడీ కి మంచి ఎక్సరసైజ్ అని, డాన్స్ లో అన్ని మూమెంట్స్ తో బాడీ ని స్ప్రింగ్ లా మార్చొచ్చు.. సో జిమ్ లో వర్కౌట్స్ చేసి బరువు తగ్గక్కర్లేదు అంటుంది ఈ నేచురల్ బ్యూటీ. ఇక లవ్ స్టోరీ తో హిట్ కొట్టిన సాయి పల్లవి రానా తో నటించిన విరాట పర్వం మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంది. 

No Gym, Only Dance:

Sai Pallavi says no Gym

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ