Advertisementt

ఇంట్రెస్టింగ్: ఏపీ సీఎం జగన్‌తో నాగార్జున భేటీ

Thu 28th Oct 2021 04:05 PM
nagarjuna,cm jagan,ap cm jagan,nag and producers,cinema industry  ఇంట్రెస్టింగ్: ఏపీ సీఎం జగన్‌తో నాగార్జున భేటీ
Nagarjuna meets AP CM Jagan ఇంట్రెస్టింగ్: ఏపీ సీఎం జగన్‌తో నాగార్జున భేటీ
Advertisement
Ads by CJ

గత నెలలో సినీప్రముఖులు ఏపీ సీఎం ని కలవడానికి ప్రయత్నాలు చెయ్యడం, తర్వాత బడా న్మిర్మాతలు మంత్రి పేర్ని నాని తో భేటీ అవడం లాంటి హడావిడి చూసాం. పవన్ కళ్యాణ్ ఏపీ మంత్రులు, ముఖ్యమంత్రి పై చేసినా వ్యాఖ్యల తర్వాత చిరు లాంటి పెద్దలు ఏపీ ముఖ్యమంత్రిని కలవలేదు. అయితే తాజాగా ముఖ్యమంత్రి జగన్ కలిసేందుకు అక్కినేని నాగార్జున విజయవాడ వెళ్లడం హాట్ టాపిక్ అయ్యింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వచ్చిన నాగ్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లి జగన్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే నాగార్జునతోపాటు ఐదుగురు నిర్మాతలు కూడా సీఎం జగన్ ని కలిసిన వారిలో ఉన్నారు. కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి వివాదం నేపథ్యంలో రిలీజ్ కాలేదు. ఇటువంటి వివాదం పరిశ్రమకు, ప్రభుత్వానికి మంచిదికాదని.. ముఖ్యంగా పరిశ్రమ నష్టపోతుందని భావిస్తూ సీఎంతో చర్చించేందుకు వచ్చినట్లు తెలుస్తుంది. 

నాగార్జునతో పాటు సినీ నిర్మాతలు ప్రీతంరెడ్డి, నిరంజన్ రెడ్డి జగన్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నాగార్జున సినీ పరిశ్రమకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. సినీ రంగానికి వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ఈ సందర్భంగా జగన్ నాగార్జున కి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సీఎం జగన్ తో కలిసి నాగార్జున ఇంకా నిర్మాతలు భోజనం కూడా చేశారు.

Nagarjuna meets AP CM Jagan:

Nagarjuna meets AP CM YS Jagan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ