ప్రపంచానికి థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంది అని, ఇప్పటికే చైనా, రష్యాలు లాక్ డౌన్ లోకి వెళ్లాయని చెబుతున్న నేపథ్యంలో ఇండియాలో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. కొద్ది రోజులుగా 12 వేల కేసులు నమోదు అవుతున్న ఇండియాలో తాజాగా 16 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. బుధవారం 12,90,900 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 16,156 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ముందురోజు అంటే మంగళవారం కంటే దాదాపు 3 వేల కేసులు అదనంగా వెలుగుచూశాయి. కొద్ది రోజులుగా కేరళ ప్రభుత్వం మృతుల సంఖ్యను సవరిస్తోంది. ఫలితంగా మరణాల సంఖ్య పెరిగింది.