Advertisementt

ప్రీతం జుకల్కర్ తో దుబాయ్ కి సమంత

Wed 27th Oct 2021 10:24 PM
samantha ruth prabhu,samantha,sadhana,preetham jukalker,samantha dubai trip,samantha with preetham jukalker  ప్రీతం జుకల్కర్ తో దుబాయ్ కి  సమంత
Samantha in Dubai with Preetham Jukalker ప్రీతం జుకల్కర్ తో దుబాయ్ కి సమంత
Advertisement
Ads by CJ

టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్.. సమంత గత రెండు నెలలుగా తరచూ వార్తల్లో నిలుస్తున్న సెలెబ్రిటీ. ఫ్యామిలీ మ్యాన్ 2 లో బోల్డ్ సీన్స్ తో అందరికి షాక్ ఇచ్చిన సమంత.. ఆ తర్వాత నాగ చైతన్య తో విడాకుల మేటర్ తో మరింతగా హైలెట్ అయ్యింది. చైతు కి విడాకులు ఇచ్చిన తర్వాత సమంత సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతూ బిజీ అయ్యింది. చైతు తో విడిపోయిన బాధని మరిచిపోవడానికి ఫ్రెండ్స్ తో సైకిల్ తొక్కుతూ వెకేషన్స్ లో ఒంటరిగా గడిపింది. ఆ తర్వాత సమంత శిల్ప రెడ్డి తో కలిసి ఆధ్యాత్మిక యాత్ర చేసింది. గంగోత్రి, కాశీ, బద్రీనాధ్ యాత్ర అంటూ ఆశ్రమాల వెంట తిరిగిన సమంత ఇప్పుడు మరో ట్రిప్ వేసింది.

తన పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతం, సాధన లతో కలిసి సమంత దుబాయ్ ట్రిప్ వేసింది. అయితే సమంత తన క్లోజ్ ఫ్రెండ్స్ తో దుబాయ్ వెళ్ళింది మాత్రం దుబాయ్ లో ఆదివారం జరగబోయే భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్ కోసమే అయ్యుండొచ్చు అని అంటున్నారు. సమంత గుళ్ళు, గోపురాల వెంట తిరిగి కాస్త బాధని మరిచిపోయినట్టుగా అనిపించింది. ఇప్పుడు కూడా ఈ ట్రిప్ తనలోని ఉన్న ఆ కొంచెం బాధని పూర్తిగా మరిచిపోవడానికే  అన్నట్టుగా సమంత తన ఫ్రెండ్స్ ప్రీతమ్, సాధనాలతో కలిసి దిగిన ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

Samantha in Dubai with Preetham Jukalker:

Samantha Ruth Prabhu Kickstarts Dubai Vacation

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ