Advertisementt

సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్దన్న ట్రైలర్

Wed 27th Oct 2021 09:18 PM
peddanna movie,rajinikanth,super star rajinikanth peddanna,peddanna trailer review,meena,khushbee,keerthy suresh,nayanthara  సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్దన్న ట్రైలర్
Peddanna Trailer review సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్దన్న ట్రైలర్
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా హై యాక్షన్ ఓల్టేజ్‌తో రాబోతోన్న పెద్దన్న చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల కాబోతోంది. టాలీవుడ్‌ డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామి అయిన ఏసియన్ ఇన్ ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్‌పి సంస్థ అన్నాత్తె డబ్బింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో నారాయణదాస్ నారంగ్, సురేష్ బాబు కలిసి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించబోతోన్నారు.

నాలుగు రోజుల క్రితం విడుదల చేసిన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ట్రైలర్‌ను రిలీజ్ చేసి పండుగను ముందే తీసుకొచ్చారు మేకర్స్. ఈ ట్రైలర్‌లో రజినీ మార్క్ డైలాగ్స్ ఎన్నో ఉన్నాయి. ఊరి పంచాయితీ పెద్దగా రజినీకాంత్ కనిపించబోతోన్నారు. అతని ముద్దుల చెల్లెలిగా కీర్తి సురేష్ నటించారు. ఇక రజినీ కాంత్ చెప్పిన డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. రెండు నిమిషాల నలభై సెక్లను ఉన్న ఈ ట్రైలర్‌లో రజినీ మేనియా మొత్తం కనిపించింది.

నువ్ ఎవరన్నది.. నువ్ వెనకేసున్న ఆస్తిలోనో,  నీ చుట్టూ ఉన్న మనిషుల్లోనూ లేదు..నువ్  చేసే చర్యల్లోనూ మాట్లాడే మాటల్లోనూ ఉంటుంది.. ఇది వేదవాక్కు, న్యాయంగానూ ధైర్యంగానూ ఓ ఆడపిల్ల ఉంటే.. ఆ దేవుడి దిగి వచ్చి తనకు తోడుగా ఉంటాడు, ఈ రోజు నుంచి మొదలవుతుంది జాతర.. మిఠాయి కిల్లీ అంటూ రజినీ చెప్పిన డైలాగ్స్ మాస్  ఆడియెన్స్‌కు ట్రీట్‌లా ఉన్నాయి.

నయనతార అందంగా ఉంది. ఇక క్రూరమైన విలన్‌గా జగపతి బాబు మెప్పించారు. ఇక ఈ చిత్రంలో మీనా, కుష్బూ, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతోన్నారు. డి ఇమ్మాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ మెప్పించేలా ఉంది. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. వెట్రి సినిమాటోగ్రఫర్‌గా, రూబెన్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

నవంబర్ 4న దీపావళి కానుకగా పెద్దన్న అత్యధికే థియేటర్‌లో భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ట్రైలర్‌ను చూస్తే సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనిపిస్తోంది.

Peddanna Trailer review :

Rajinikanth Peddanna Trailer review 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ