ప్రభాస్ వరసబెట్టి పాన్ ఇండియా మూవీస్ ప్రకటిస్తున్నాడు.. అసలే సినిమాకి సినిమాకి మూడేళ్ళ గ్యాప్ లేనిదే ప్రభాస్ సినిమాలు రిలీజ్ చెయ్యడు.. ఇప్పుడు ఏకంగా ఐదు ప్రాజెక్ట్స్ ని ప్రభాస్ ఎలా పూర్తి చేస్తాడు అనే బెంగతో ప్రభాస్ ఫాన్స్ ఉన్నారు. కానీ ప్రభాస్ మాత్రం సినిమాలని పాన్ ఇండియా స్టయిల్లో ప్రకటించడమే కాదు.. ఆ సినిమాల షూటింగ్స్ ని పరిగెత్తిస్తున్నాడు. ఇప్పటికే రాధేశ్యామ్ షూటింగ్ కంప్లీట్ చేసి ఇప్పుడు ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓం రౌత్ కూడా చకచకా ఆదిపురుష్ షూటింగ్ ని కంప్లీట్ చేసేస్తున్నాడు. ఇప్పటికే జానకి పాత్రధారి కృతి సనన్, రావణ్ పాత్రధారి సైఫ్ అలీ ఖాన్ పార్ట్ షూట్ కంప్లీట్ చేసిన ఓం రౌత్ ఇప్పుడు ప్రభాస్ పాత్రపై కీలక సన్నివేశాల చిత్రీకరణ చేపట్టాడు.
మరి ప్రస్తుత చిత్రీకరణ షెడ్యూల్ ఆదిపురుష్ కి సంబందించిన లాస్ట్ షెడ్యూల్ కావడంతో.. ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్ ని త్వరగానే ముగించెయ్యబోతున్నాడు. ఇంకేముందు.. తదుపరి మాస్ ఎంటర్టైనర్ సలార్ షూట్ కి జంప్ అవుతాడు. అంతేకాకుండా.. నవంబర్ నుండి ప్రభాస్ నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కె మూవీ ని కూడా పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నట్లుగా టాక్ ఉంది. ఇక ఇప్పటికే అమితాబచ్చన్ పై నాగ్ అశ్విన్ ట్రయిల్ షూట్ కూడా చేసేసాడు. ఈ రెండు చిత్రాల షూటింగ్ ని పార్లల్ గా చెయ్యబోతున్న ప్రభాస్ తదుపరి స్పిరిట్ షూట్ లో జాయిన్ అవుతాడు. మరి పాన్ ఇండియా మూవీస్ ని జోరుగా ప్రకటించడమే కాదు.. ఆంటే జోరు మీద షూటింగ్స్ కూడా కంప్లీట్ చేస్తూ ఫాన్స్ కే షాకిస్తున్నాడు ప్రభాస్.