మెగా మేనల్లుడు, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వినాయక చవితి రోజున బైక్ యాక్సిడెంట్ లో గాయాల పాలై అపోలో హాస్పిటల్ లో దాదాపుగా 35 రోజులు ట్రీట్మెంట్ లో ఉన్నాడు. దసరా రోజున, ఆయన బర్త్ డే కి సాయి ధరమ్ అపోలో నుండి డిశ్చార్జ్ అయ్యి.. ఇంటికి వెళ్లినప్పటికీ.. సాయి తేజ్ మొహం కవర్ చేస్తూ కేవలం హ్యాండ్ మాత్రమే సోషల్ మీడియాలో కనిపిస్తుంది.. కానీ సాయి ధరమ్ పూర్తిగా కోలుకున్నాడో.. లేదో.. తెలియకుండా సస్పెన్స్ లో పెట్టారు. అయితే రోడ్డు యాక్సిడెంట్ వలన సాయి తేజ్ ముఖం అవి పీక్కుపోవడంతో.. సెలెబ్రిటీ అయిన కారణంగా సాయి తేజ్ బయట ఎవరికీ కనిపించడం లేదు. హరీష్ శంకర్ వెళ్ళినప్పుడు జస్ట్ షేక్ హ్యాండ్ తోనే సరిపెట్టారు.
ఇక ఇంట్లో రెస్ట్ లో ఉన్న సాయి ధరమ్ హెల్త్ కండిషన్ పై స్పెషల్ అప్ డేట్ బయటికి వచ్చింది. ప్రస్తుతం సాయి ధరమ్ కి ప్రత్యేక నిపుణుల సమక్షంలో ఫిజియో థెరపీతో పాటు స్పీచ్ థెరపీ అందిస్తున్నారట. బాడీ మొత్తం ఇప్పుడిప్పుడే పూర్తి కండీషన్ లోకి వస్తోందని తెలుస్తుంది. ఇంటి దగ్గరే ఉంటూ ప్రత్యేక డైట్ తీసుకుంటున్న సాయి ధరమ్ తేజ్ గాయాల బారి నుంచి పూర్తిగా కోలుకుని ఇప్పుడు నార్మల్ కండీషన్‌లో కి వస్తున్నట్లుగా సమాచారం.